Kubera Movie : ‘లవ్ స్టోరీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, ఇప్పుడు ‘కుబేర’ చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. ఇందులో నాగార్జున ఒక ఫ్యామిలీ మ్యాన్ గా, నిజాయితీ గల ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపిస్తే, ధనుష్ బిచ్చగాడి రూపం లో కనిపించాడు. గ్లిమ్స్ వీడియో చివర్లో ఆయన పాత లుక్ లో కనిపిస్తాడు. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో ఆయన క్యారక్టర్ ఉంటుంది అనే విషయం ఈ గ్లిమ్స్ వీడియోని చూస్తే అర్థం అవుతుంది. చూస్తుంటే శేఖర్ కమ్ముల మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అనేది అర్థమైపోతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన ‘కంగువా’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద మైనస్ అయ్యిందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆయనని డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2: ది రూల్’ నుండి తప్పించడం, ఆయన స్థానంలోకి థమన్ ని తీసుకోవంటివి చూసి, ఇక దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ గ్లిమ్స్ వీడియో లో దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించి , తన విశ్వరూపం చూపించాడు. మ్యూజిక్ ఔట్పుట్ కేవలం తనని సరిగ్గా ఉపయోగించుకునే డైరెక్టర్ ని బట్టి ఉంటుందని ఆయన తన పనితనం తో మరోసారి చెప్పకనే చెప్పాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ చిత్రం కథని శేఖర్ కమ్ముల చాలా ఏళ్ళ క్రితమే రాసుకున్నాడట. అయితే ఆయన ఈ కథ రాసుకున్న రోజుల్లో అక్కినేని నాగార్జున, రామ్ చరణ్ కాంబినేషన్ లో తియ్యాలని అనుకున్నాడట. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. #RRR చిత్రానికి ముందు ఈ సినిమా స్టోరీ ని శేఖర్ కమ్ముల రామ్ చరణ్ కి వినిపించాడట. ఆయన బాగా నచ్చింది కానీ, కొంత కాలం ఆగాలని చెప్పాడట. ఈలోపు #RRR చిత్రం విడుదలై పెద్ద హిట్ గా నిల్చి రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ని తెచ్చింది. ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న సినిమాలన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఇమేజి కి తగ్గ స్టోరీ ఇది కాదని, అందుకే ఆయన స్థానంలోకి ధనుష్ ని తీసుకున్నారని తెలుస్తుంది. అయితే నాగార్జున, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కి ఉండుంటే బాగుండేది అని అభిమానులు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.