కరోనా ఎఫెక్ట్ తో దేశంలోని థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సినీప్రియులంతా ఓటీటీ, టెలివిజన్ షోలకు అలవాటుపడిపోయాయి. ఇటీవలీ కాలంలో కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని భాషలకు చెందిన సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ సినిమాలు కూడా ఇటీవలీ కాలంలో ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.
టాలీవుడ్లోని చిన్న సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజవుతన్నాయి. పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లలో రిలీజ్ చేసేందుకే టాలీవుడ్ నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘వి’ మూవీ టాలీవుడ్ నుంచి రిలీజైన పెద్ద సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించింది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా నిర్మాత దిల్ రాజు రూ.10కోట్లకు పైగా ఆదాయాన్ని ఇచ్చింది. దీంతో పలువురు నిర్మాతలు తమ మూవీలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో అనుష్క నటించిన ‘నిశబ్దం’ మూవీ రిలీజ్ కానున్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఇదే సమయానికి నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ‘ఆహా’ ఓటీటీలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఒరేయ్ బుజ్జిగాడు’ మూవీ రాబోతుంది. ఓటీటీలో రెండు తెలుగు మూవీలు క్లాష్ కావడం ఇదే తొలిసారి అని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.
అనుష్కకు ఉన్న క్రేజ్ దృష్టా అమెజాన్ ప్రైమ్ కు కలిసి రానుంది. ఇదే సమయంలో ‘ఆహా’లో రిలీజ్ కానున్న ఒరేయ్ బుజ్జిగాడు మూవీకి పెద్ద దెబ్బతగిలే అవకాశం కన్పిస్తోంది. నిశబ్ధం మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మాధవన్, అంజలి, శాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన వెంకట్ గతంలో నిర్మించిన పలు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ‘నిశబ్దం’ మూవీ కూడా భారీ హిట్టు అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
థియేటర్లో రిలీజు కావాల్సిన ‘నిశబ్ధం’ చివరికీ ఓటీటీలో వస్తుండటంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఇదే సమయంలో రాజ్ తరుణ్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగాడు’ వస్తుండటంతో ఈ మూవీపై ‘నిశబ్ధం’ ప్రభావం పడేలా కన్పిస్తోంది. దీంతో ‘ఆహా’ నిర్వహాకులు ఈ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తారా? లేదా అమెజాన్ తో పోటికీ సై అంటారా? అనేది వేచి చూడాల్సిందే..!