సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’ సీక్వెల్ రాబోతుందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు వాసు ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్న మాట వాస్తవం. అయితే, ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. ఇక ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుష్క నటించబోతుంది. ఇప్పటికే అనుష్క ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.
సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ కొత్త సినిమా ‘విక్రమ్’. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ నిన్నటి నుంచి చెన్నైలో స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారు కూడా ప్రస్తుత షెడ్యూల్ షూట్ లో పాల్గొంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కమల్ సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్’ నిర్మిస్తుంది.
విజయ్ దేవరకొండ మంచి బిజినెస్ మెన్. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా దిగాడు. ఏవీడీ (ఆసియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేస్తున్నాడు. మరి మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఈ హీరో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మాజీ హీరో రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయట.