‘వకీల్ సాబ్‌’ సినిమానే చివరిది అంటున్న దిల్‌ రాజు!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు నెలల పాటు ఆగిపోయిన షూటింగ్స్ ఈ మధ్యే మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాల్సిన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులతో షూటింగ్స్‌ చేస్తున్నారు. పెద్ద సినిమాల చిత్రీకరణకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇక మూడు నెలల నుంచి మూతపడ్డ థియేటర్లపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకో లేకపోతున్నాయి. సీటింగ్స్‌లో మార్పులు చేసినప్పటికీ మరో రెండు, మూడు నెలల వరకూ వాటిని ఓపెన్‌ చేసే పరిస్థితి కనిపించడం […]

Written By: Neelambaram, Updated On : June 14, 2020 4:46 pm
Follow us on


కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు నెలల పాటు ఆగిపోయిన షూటింగ్స్ ఈ మధ్యే మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాల్సిన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులతో షూటింగ్స్‌ చేస్తున్నారు. పెద్ద సినిమాల చిత్రీకరణకు ఇంకా సమయం పట్టేలా ఉంది.

ఇక మూడు నెలల నుంచి మూతపడ్డ థియేటర్లపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకో లేకపోతున్నాయి. సీటింగ్స్‌లో మార్పులు చేసినప్పటికీ మరో రెండు, మూడు నెలల వరకూ వాటిని ఓపెన్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు. కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. అయితే, పెద్ద సినిమాల విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్కెట్‌తో పాటు ఆయా హీరోల అభిమానుల దృష్టిలో ఉంచుకొని థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

అదే సమయంలో చిత్ర నిర్మాణాల విషయంలో కూడా దర్శక, నిర్మాతలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమై షూటింగ్ ఆగిపోయిన చిత్రాలనే ముందుగా పూర్తిగా చేయాలని పరిస్థితులు పూర్తిగా మెరుగుపడే వరకూ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర నిర్మాత దిల్‌ రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మరే కొత్త ప్రాజెక్టును ప్రారంభించకూడదని డిసైడ్ అయ్యాడట. ఆయన నిర్మించిన ‘వీ’ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కొంత విరామం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సగం కంటే ఎక్కువ సినిమాను చిత్రీకరించారు. షూటింగ్స్‌కు అనుమతి వచ్చినప్పటికీ.. సిచ్యువేషన్‌ కంట్రోల్‌లోకి వచ్చాకే మళ్లీ సెట్స్‌పైకి వెళ్లాలని పవన్‌ ఇప్పటికే తేల్చిచెప్పాడట. దాంతో, ఈ మూవీ కంప్లీట్‌ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దాంతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘వీ’ని రిలీజ్‌ చేయడంతో పాటు ‘వకీల్ సాబ్‌’ను ఎలాగోలా పూర్తి చేయాలని, ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు సెట్స్‌పైకి తీసుకెళ్లకూడదని దిల్‌ రాజ్‌ భావిస్తున్నాడట. వచ్చే ఏడాది వరకు కొత్త సినిమాలను ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడట. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే కొత్త చిత్రాలను ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశ్యం. తాను నిర్మించినా, రిలీజ్‌ చేసినా ఎంతో పక్కాగా వ్యవహరించడం దిల్‌ రాజు శైలి. అలాంటి వ్యక్తే ఈ ఏడాది కొత్త సినిమాల నిర్మాణం వద్దనుకుంటే.. మిగతా వాళ్లు కూడా అదే పని చేసే అవకాశం ఉంది.