Telugu Industry: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు సాగుతుంతోంది. మొన్నటి వరకు పాన్ ఇండియాకే పరిమితమైన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే దర్శకులు ఉండడం అలాగే వాళ్ళు భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరు ఎలాంటి నటనను చూపించినా కూడా ఎమోషనల్ సన్నివేశంలో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించే నటులు మాత్రం కొందరే ఉన్నారు…ఇక ఆ ఒక్క స్టార్ హీరో ఎమోషనల్ సన్నివేశాల్లో నటిస్తే మాత్రం ఎంతటి రాయి గుండె కలిగినవాడైన సరే కరిగిపోయే కంటతడి పెట్టాల్సిందే. ఇంతకీ ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా? విక్టరీ వెంకటేష్…కెరియర్ స్టార్టింగ్ లో ఆయన లవ్ స్టోరీ, మాస్ సినిమాలను చేస్తూ వచ్చినప్పటికి 1995 వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఆయన మొత్తం ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన సినిమాలను చేస్తూ రావడం విశేషం… వాటితోనే వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు.
ఒకరకంగా ఎమోషనల్ సినిమా ఏదైనా ఉంది అంటే అది వెంకటేష్ కు తప్ప ఇంకెవరికి వర్కౌట్ కాదు అనే రేంజ్ లో పేరు సంపాదించుకోవడం విశేషం… మిగతా హీరోలు చేసే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికి వెంకటేష్ రేంజ్ లో మాత్రం ఎవరు మెప్పించలేకపోయారనే చెప్పాలి.
అందుకే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తుందని సినిమా మేధావులు సైతం చెబుతూ ఉండడం విశేషం… మొత్తానికైతే వెంకటేష్ చేసిన ప్రతి సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. దానివల్ల అతని సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది… ఇప్పటికీ ఆయన ఫ్యామిలీ సబ్జెక్టుతో వచ్చిన ప్రతిసారి విజయాన్ని సాధిస్తాడనే ఒక పేరు ఉంది.
ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించే హీరో ఎవరు అనే విషయం మీద సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికైతే అందులో చాలామంది వెంకటేష్ పేరు చెబుతుండడం విశేషం…ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరోసారి ఫ్యామిలీ సినిమా చేస్తుండటం విశేషం…