Tollywood Heroes Remuneration: దేశంలో అత్యధిక టర్నోవర్ కలిగిని బిజినెస్ సినీ ఇండస్ట్రీలోనే జరుగుతుంది. కోట్ల కొద్దీ ఇన్వెస్ట్ మెంట్ చేసి అంతకుమించి లాభాలు పొందుతారు. ఈ క్రమంలో సినిమాలో నటించేవారికి కూడా అత్యధిక పారితోషికం ఇస్తూ ఉంటారు. దేశంలో స్టార్లు గా మారిన హీరోలకు కోట్లలోనే రెమ్యూనరేషన్ ఉంటుంది. వీరికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ను భట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. అంతకుముందు తెలుగు హీరోలకు పారితోషికం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు రావడంతో హీరోల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఇండియా లెవల్లో హైయ్యేస్ట్ ఆదాయాన్ని అందుకుంటున్న హీరోల్లో తెలుగు హీరోలు పోటీ పడుతున్నారు. మరి ఎవరు ఎంత తీసుకుంటున్నారో ఒక సారి పరిశీలిద్దాం..
ప్రభాస్:
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ కు పెరిగింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా బాగానే పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రాలే తీస్తున్నారు. దీంతో ఆయన ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇదే కాకుండా సినిమా హిట్టయితే వచ్చే లాభాల్లో కూడా రెబల్ స్టార్ కు వెళుతుంది.
అక్షయ్ కుమార్:
పాన్ ఇండియా లెవల్లో అక్షయ్ కుమార్ కు మంచి పేరు ఉంది. విభిన్న పాత్రలను పోషించే ఆయన ప్రయోగాత్మక చిత్రాలను ఎక్కువగా తీస్తుంటారు. లాస్ట్ ఆయన తీసిన ‘రామ్ సేతు’ సక్సెస్ తో అక్షయ్ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘కట్ పుట్లి’ అనే సినిమాతో థియేటర్లోకి రాబోతున్నాడు.
రామ్ చరణ్:
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలోకి ఎక్కాడు. ఆయన చివరిసారిగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వేదికపైకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో రామ్ తో భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తీస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు వసూలు చేస్తుంటారట. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..
విజయ్:
ఇళయ దళపతిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కు సౌత్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయన సినిమాలో సౌత్ తో పాటు నార్త్ లోనూ సక్సెస్ సాధిస్తున్నాడ. ఇటీవల ‘వారసుడు’ సక్సెస్ తో విజయ్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో ఆయన ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు వసూలు చేస్తున్నాడు.
షారూఖ్ ఖాన్:
బాలీవుడ్ బాద్ షా దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయన స్టార్ ఇమేజ్ తగ్గడం లేదు. నేటి కుర్రాళ్లకు పోటీనిస్తూ సినిమాలు తీస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘పఠాన్’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇదే ఊపుతో ‘జవాన్’తో థియేటర్లోకి వస్తున్నాడు. షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు వసూలు చేస్తాడు.
సల్మాన్ ఖాన్:
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు వసూలు చేస్తున్నాడు.
మహేష్ బాబు:
వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు వసూలు చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్:
ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్న పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు తీసుకుంటాడు. ఇప్పటికీ యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పవన్ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు.
ఎన్టీఆర్:
పవర్ ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరల్డ్ లెవల్లోకి పెరిగింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్కెట్ విలువ రూ.55 కోట్లు.
అల్లు అర్జున్:
పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. పుష్ప రెండు భాగాలు కలిపి రూ.70 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.