War 2 Theatres Reaction: ఎన్టీఆర్(Junior NTR) కి, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి మరియు నారా కుటుంబానికి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది అనే భావన ప్రతీ ఒక్క నందమూరి అభిమానిలో కలిగింది అనేది వాస్తవం. నందమూరి తారక రత్న దినం రోజున వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలయ్య అవమానించడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ స్పందించకపోవడం, రీసెంట్ గా జరిగిన ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ గా మాట్లాడడం, తనకు ఎవ్వరూ లేరని, సొంతంగా పైకి ఎదిగానని, తన అమ్మానాన్నలు మాత్రమే అండగా నిలబడ్డారని చెప్పడం, ఇలా ఎన్నో సంఘటనలు నందమూరి కుటుంబం లో చీలికలు ఏర్పడ్డాయి అనే వాస్తవాన్ని నిజం చేస్తున్నాయి. అయితే నేడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఎలా ఉంది ?, కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి?, హిట్ అయ్యిందా?, ఫ్లాప్ అయ్యిందా వంటి లెక్కలను కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం లో కొన్ని డైలాగ్స్ ఎన్టీఆర్ తన నిజ జీవితానికి దగ్గర గా ఉండేలా, బాలయ్య బాబు కి నారా ఫ్యామిలీ కి పరోక్షంగా కౌంటర్ ఇచేలా ఉందని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇందులో ఆయన ‘ఒంటరి పోరాటం చేస్తూ..అందరికీ దూరం అవుతూ’ అంటూ తన గురించి తాను చెప్పుకుంటాడు. ఈ డైలాగ్ విన్న వెంటనే ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం దూరం పెట్టేసారు కదా అనేది మన మైండ్ లోకి వస్తుంది. రచయితా ఎన్టీఆర్ నిజ జీవితంలోని వాస్తవ పరిస్థితి ని ఆధారంగా చేసుకొని రాసినట్టు ఉంది. ఈ డైలాగ్ వెనుక ఎన్టీఆర్ ప్రమేయం ఉందా?, లేక ఆయన ప్రేమయం లేకుండానే జరిగిందా?.
Also Read: ఎన్టీఆర్ కి ‘వార్ 2’ బిగ్ అలెర్ట్..ఇకపై ఇలాంటి రోల్స్ చేస్తే ఫ్యాన్స్ దూరం అవుతారా?
ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆయన అభిమానులకు దాదాపుగా క్లారిటీ ఇచ్చేసాడు, ఈరోజు సినిమాలోని ఈ డైలాగ్ విన్న తర్వాత కచ్చితంగా ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా ఇది జరిగి ఉండదని అంతా అనుకుంటున్నారు. ఆయనకు రాజకీయాల్లోకి త్వరలోనే వచ్చే ఆసక్తి ఉందని ఇంతకు మించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. 2029 లోపు ఆయన జాతీయ పార్టీ లో చేరి ఆ పార్టీ బాధ్యతలను ఆంధ్ర రాష్ట్రంలో చేపడుతాడా?, లేకపోతే కొత్త పార్టీ స్థాపిస్తాడా అనేది చూడాలి. ఒకవేల కొత్త పార్టీ స్థాపిస్తే మాత్రం తెలుగు దేశం పార్టీ రెండుగా చీలిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఎన్టీఆర్ ఎదో పెద్ద ప్రణాళిక తోనే ఉన్నాడు. రాబొయ్యే రోజుల్లో కచ్చితంగా దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.