https://oktelugu.com/

Tollywood Films In October: అక్టోబర్ నెలలో విడుదల కాబోయే టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే!

Tollywood Films In October: కరోనా ప్రభావంతో గత కొన్ని నెలల నుంచి సినిమా థియేటర్లు మూత పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను సందడి చేశాయి.ఈ క్రమంలోనే గత నెల నుంచి థియేటర్లు ఓపెన్ కావడంతో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకుల సందడి చేశాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో దసరా పండుగ ఉండడంతో చాలా సినిమాలు దసరా బరిలో దిగనున్నాయి. ఇప్పటివరకు […]

Written By: , Updated On : October 7, 2021 / 11:31 AM IST
Follow us on

Tollywood Films In October: కరోనా ప్రభావంతో గత కొన్ని నెలల నుంచి సినిమా థియేటర్లు మూత పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను సందడి చేశాయి.ఈ క్రమంలోనే గత నెల నుంచి థియేటర్లు ఓపెన్ కావడంతో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకుల సందడి చేశాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో దసరా పండుగ ఉండడంతో చాలా సినిమాలు దసరా బరిలో దిగనున్నాయి. ఇప్పటివరకు నాగచైతన్య లవ్ స్టోరీ, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలు థియేటర్లు విడుదలయ్యి మరికొన్ని సినిమాలకు దైర్యం చెప్పాయని చెప్పవచ్చు. అయితే అక్టోబర్ నెలలో విడుదల కాబోయే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..

అక్టోబర్ 8 వ తేదీ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన “కొండపొలం” చిత్రం విడుదల కానుంది.


అక్టోబర్ 14 వ తేదీ ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా లవ్ అండ్ యాక్షన్ జానర్లో తెరకెక్కిన చిత్రం “మహాసముద్రం”. ఈ సినిమా అక్టోబర్ 14 వ తేదీ విడుదల కానుంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అక్టోబర్ 15 వ తేదీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎన్నో అడ్డంకులను తొలగించుకుని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది.

అక్టోబర్ 15 వ తేదీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా హీరోహీరోయిన్లుగా “పెళ్లి సందD” సినిమా 15 వ తేదీ విడుదల కానుంది.

అక్టోబర్ 15 వ తేదీ రీతూవర్మ, నాగసౌర్య జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రం కూడా అక్టోబర్ 15న విడుదల కానుంది.

అక్టోబర్ 22వ తేదీ రేవంత్ కోరుకొండ దర్శకత్వం ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు నటిగా నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం “నాట్యం”. ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.