KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది తెలుసు. కొద్ది రోజులుగా రాష్ర్టంలో రెండు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న కేసీఆర్ ఉపరాష్ర్టపతి కాబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం రాదనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకోవాలని చూస్తోందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి లభించే ఎంపీ సీట్లతో తన బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్(KCR) ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని ప్రచారం సాగిన నేపథ్యంలో ఆయనకు బీజేపీ ఉపరాష్ర్టపతి పదవి ఇస్తామని చెబుతోందని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కు పదవి అప్పగిస్తే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సత్సంబంధాలుంటాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్ పూజ కోసం వారం రోజులు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం త్వరలో పూర్తి కానున్న సందర్భంలో కేసీఆర్ కు ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ఉపరాష్ర్టపతి అయితే కేటీఆర్ ను సీఎం గా చేసే వీలుంటుంది. ఇందుకోసమే కేసీఆర్ బీజేపీ ప్రతిపాదనను కాదనలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
కేసీఆర్(KCR) కు ఉపరాష్ర్టపతి, హరీశ్ రావుకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం కేసీఆర్ ఏ మేరకు బీజేపీ ప్రతిపాదనను ఆమోదిస్తారా? లేదా? అనేది సంశయమే. కానీ కొద్దిరోజులుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తున్న క్రమంలో కేంద్రం ప్రతిపాదనను కేసీఆర్ అంగీకరిస్తారో లేక తిరస్కరిస్తారో అనే అనుమానాలు అందరిలో నెలకొంటున్నాయి.