Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు 0.72 శాతం నష్టంతో 81, 584,94, నిఫ్టి 174.95 పాయింట్లు లేదా.70 శాతం నష్టంతో 24,826.20 వద్ద నిలిచాయి.