Jr Ntr: తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తూ అక్కడి ప్రేక్షకులకు సైతం దగ్గరవుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని.. కానీ మేమిద్దరం(రామ్ చరణ్, ఎన్టీఆర్) మంచి స్నేహితులమని… మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అన్నారు ఎన్టీఆర్.
మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారని… ‘ఆర్ఆర్ఆర్’ తరువాత అందరూ ఒకే తాటిమీదకు వస్తారని, భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు ఎన్టీఆర్. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ… ఆయన కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, తన జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని చెప్పారు. తాను మంచి నటుడిగా మారడానికి కూడా రాజమౌళినే కారణమని ఎన్టీఆర్ చెప్పారు.