Telugu Directors Bollywood Heroes Collaboration: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో మన దర్శకులతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా టాప్ పొజిషన్లో ఉన్న దర్శకులతో సినిమాలు చేసే అవకాశం ఇతర భాషల హీరోలకు రావడం లేదు. ఎందుకంటే మన టాప్ డైరెక్టర్లు మన హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఇక ఇట్లాంటి క్రమంలోనే వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే మన స్టార్ హీరోలందరు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అతనికి డేట్స్ ఇచ్చే వాళ్ళు కరువయ్యారు. దాంతో బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అలాగే ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్న బుచ్చిబాబు సైతం షారుక్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలైతే చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బుచ్చిబాబు షారుక్ ఖాన్ కలిసి తనకి కథనైతే వినిపించారట.
పెద్ది సినిమా రిజల్ట్ ని బట్టి బాలీవుడ్ కింగ్ ఖాన్ అయిన షారుక్ ఖాన్ అవకాశాన్ని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదంతా చూస్తున్నా ట్రేడ్ పండితులు మాత్రం మన తెలుగు దర్శకులు బాలీవుడ్ హీరోలను ఎందుకు నమ్ముకుంటున్నారు. మన టైర్ వన్ హీరోలు అవకాశం ఇవ్వకపోతే టైర్ 2 హీరోలు ఉన్నారు కదా వాళ్లతో సినిమాలను చేసి వాళ్లకు సక్సెస్ లను అందించవచ్చు కదా…
ఇదంతా పక్కన పెట్టి బాలీవుడ్ వాళ్ల మీద మన దర్శకులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ తన పరిధిని విస్తరించుకొని టాప్ పొజిషన్ లో ముందుకు సాగుతుంది. కాబట్టి బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే కంటే మన హీరోలతో సినిమాలు చేయడం మంచిది అని కొంతమంది క్రిటిక్స్ సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…