https://oktelugu.com/

Ileana: తెలుగు డైరెక్టర్ ఎప్పుడు ఆ పార్ట్ పైనే ఫోకస్ చేస్తారు : ఇలియానా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

ముఖ్యంగా ఈ మధ్య ఇలియానా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమా వారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీరు దాదాపుగా సౌత్ లో అందరి స్టార్ హీరోలతో నటించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 13, 2023 / 06:06 PM IST

    Ileana

    Follow us on

    Ileana: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని.. తెలుగు ప్రేక్షకులను ఏలిన హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత వరుసగా ఆఫర్లు తెచ్చుకున్న ఇలియానా.. తన దృష్టిని బాలీవుడ్ వైపుకి మళ్లించుకుంది.

    కాగా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత మాత్రం ఇలియానాకి ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకునిందో అంత త్వరగా నే ఫెడ్ అవుట్ అయిపోయింది ఇలియానా. ఇక తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తరువాత ఈమె చేసిన చిత్రం ఏదీ లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలియానా మళ్లీ తన ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా అలానే తాను ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా లైమ్ లైట్లో ఉంటూ వస్తోంది.

    ముఖ్యంగా ఈ మధ్య ఇలియానా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమా వారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీరు దాదాపుగా సౌత్ లో అందరి స్టార్ హీరోలతో నటించారు.. ఎన్నో విజయాలను అందుకున్నారు.. కానీ నటన పరంగా మిమ్మల్ని జనాలు గుర్తించుకునే పాత్ర ఇప్పటివరకు పడలేదని చాలామంది అనుకుంటున్నారు దీనికి మీ సమాధానమేంటి అని యాంకర్ అడగగా. దానికి స్పందించిన ఇలియానా.. నేను ఎలాంటి పాత్రని అయినా పోషించగలను కానీ తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా నాలోని నటన కంటే నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఎప్పుడూ నా నడుము పైనే దృష్టి ఉంటుంది.. అంటూ సంచలన వ్యాఖ్యలను చేసింది ఇలియానా..!

    ఇక ఇలియానా చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనిపించక మానవు. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసినా కానీ తెలుగులో ఇలియానా తన నడుము వలనే ఎక్కువ పాపులర్ అయింది.