Telugu Channels TRP Ratings: తెలుగులో ఇప్పుడు రెండు ప్రముఖ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముందుగా ఎన్టీఆర్ హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 5న నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ గా ‘తెలుగు బిగ్ బాస్’ మొదలైంది. ఈ రెండు షోలు వేటికవే ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నాయి. తాజాగా విడుదలైన టీవీ రేటింగ్స్ లలో ఏది టాప్ లో ఉందో తెలుసుకుందాం..
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ప్రముఖ రియాలిటీ టీవీ షో ‘బిగ్ బాస్ తెలుగు’(Bigg Boss) ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. బిగ్ బాస్ 5వ సీజన్ తాజాగా 15.7-18 వ్యూయర్ షిప్ తో దూసుకెళుతోంది. ఈ సీజన్ కు కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. ప్రజాదరణ చెక్కుచెదరలేదని తాజా రేటింగ్ రుజువు చేసింది. అయితే ఇది వరకు బిగ్ బాస్ షో రేటింగ్ 20 దాటగా.. ఈసారి అంతకు చేరుకోలేదని మాత్రం తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్ 4వ సీజన్ అత్యధిక రేటింగ్ సాధించింది. పబ్లిసిటీ ఈసారి బాగా లేకపోవడంతో ఈ సీజన్ కు అంతగా రేటింగ్ రాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ రెండో వారంలోకి చేరుకుంది. కంటెస్టెంట్లు హౌస్ లో గేమ్స్ లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. గొడవలు, కొట్లాటలతో వీక్షకులకు కనువిందు చేస్తోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండొచ్చని అంటున్నారు. దీంతో రేటింగ్ ముందు ముందు పెరిగే మరింత అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రేటింగ్ ప్రకారం చూస్తే ‘స్టార్ మా’ చానెల్ తెలుగులో నంబర్ 1 చానెల్ గా కొనసాగుతోంది.
-పడిపోయిన ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రేటింగ్
ఇక జెమినీటీవీలో ఆగస్టు 22న ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’(Milo Evaru Koteshwarulu) కార్యక్రమం పెద్దగా స్పందన తెచ్చుకోవడం లేదని రేటింగ్స్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటికీ 6 నుంచి 7 వరకు మాత్రమే టీవీ రేటింగ్ సాధిస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నా కూడా గత వారం ఈ షోకు 7.2 రేటింగ్ అందుకుంది. వీక్షకులను అలరించే షో అయినా కూడా ఎందుకో రేటింగ్ సాధించడం లేదు. దీంతో జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఈ షోతో ఆ చానెల్ కు పెద్దగా రేటింగ్ రావడం లేదు.
ప్రస్తుతం తెలుగులో మాటీవీ నంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత జీతెలుగు, ఈటీవీ ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలోకి జెమినీ టీవీ పడిపోయింది. గత వారం జెమినీ టీవీ 70 జీఆర్పీలను కోల్పోయింది. కాబట్టి ఎన్టీఆర్ ప్రసారం చేస్తున్నా పెద్దగా రేటింగ్ పెరగడం లేదని తెలుస్తోంది.