Covid-19: కరోనా తర్వాత శరీరంలో ఆ వ్యవస్థపై ప్రభావం.. జాగ్రత్తలు తీసుకోండి

Covid-19: దేశంలో కొవిడ్ ప్రభావం అనేక సమస్యలు సృష్టించింది. కొవిడ్ బారిన పడిన వారు పలు రకాల జబ్బుల బారిన పడడం తెలిసిందే. కొవిడ్ వ్యాపించిన తరువాత శరీరం నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తోంది. దీంతో కరోనా సోకడంతో ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతింటోందని తెలుస్తోంది. వైరస్ ప్రభావంతో నాడీ సంబంధిత రుగ్మతలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ తదితర బలహీనతలు ఆవహిస్తాయని తెలుస్తోంది. కొవిడ్ బారిన పడిన రోగులకు మెదడువాపు […]

Written By: Raghava Rao Gara, Updated On : September 16, 2021 3:14 pm
Follow us on

Covid-19: దేశంలో కొవిడ్ ప్రభావం అనేక సమస్యలు సృష్టించింది. కొవిడ్ బారిన పడిన వారు పలు రకాల జబ్బుల బారిన పడడం తెలిసిందే. కొవిడ్ వ్యాపించిన తరువాత శరీరం నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తోంది. దీంతో కరోనా సోకడంతో ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతింటోందని తెలుస్తోంది. వైరస్ ప్రభావంతో నాడీ సంబంధిత రుగ్మతలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ తదితర బలహీనతలు ఆవహిస్తాయని తెలుస్తోంది.

కొవిడ్ బారిన పడిన రోగులకు మెదడువాపు వస్తుందని చెబుతున్నారు. వీరికి బ్రెయిన్ స్రోక్ వస్తుందని తెలుస్తోంది. 65 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొవిడ్ తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కొవిడ్ సోకిన వారిలో ఆరు నెలల తరువాత ఈ లక్షణాలు ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిలో సమస్యలు ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి.

అలసట, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, కండరాల నొప్పులు, తలనొప్పి, రుచి కోల్పోవడం, డిప్రెషన్ కు లోనవడం, ఆందోళన తదితర వ్యాధులతో రోగులు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో కొవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో వారిలో ఇమ్యూనిటీ శక్తి పెరిగి తద్వారా కోలుకునే వీలుంటుందని తెలుస్తోంది.

మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తత పాటించాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే శరీర నిర్మాణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. అందుకే కరోనా బారిన పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీనిపై శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం జాగ్రత్లలు తీసుకోవాలని తెలుస్తోంది.