https://oktelugu.com/

Rajamouli – Mahesh : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటించనున్న తెలుగు, తమిళ్ స్టార్ హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి(Rajamouli) కి ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి... ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా మరెవరు ఉండరు అనేది వాస్తవం...

Written By: , Updated On : February 9, 2025 / 09:33 PM IST
Rajamouli , Mahesh babu

Rajamouli , Mahesh babu

Follow us on

Rajamouli – Mahesh : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి (Rajamouli) బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్(RRR) సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో కూడా తెలుగు సినిమాల హవాని కొనసాగించే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్న జక్కన్న తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా తెరకెక్కించాలనే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడట. ఇక అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నాడు. మరి ఎందుకు ఆయన అలా రహస్యంగా సినిమాని షూట్ చేస్తున్నాడనే విషయాలను పక్కన పెడితే తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ను సైతం తను చెప్పడానికి సిద్ధమవుతున్నాడట. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తే వాళ్లు కూడా సంతోషపడతారు కదా అంటూ రాజమౌళికి సినిమా యూనిట్ లో ఉన్న కొంతమంది చెబుతున్నారట.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులను మెప్పించబోతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో అయిన నాగార్జున (Nagarjuna) నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి దాంతో పాటుగా ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో అయిన కార్తీ (Karthi) కూడా ఇందులో ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సినిమా మీద వస్తున్న వార్తలన్నీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వస్తున్నాయి తప్ప రాజమౌళి మాత్రం వాటిని స్పష్టంగా తెలియజేయడం లేదు.

ఇక ఈ సినిమాలో ‘ప్రియాంక చోప్రా’ (Priyanka Chopra) నటిస్తుందనే ఒక్క విషయాన్ని తప్ప మిగతా ఏ విషయాన్ని కూడా తను బహిర్గతం చేయలేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్న వార్తల్లో కొంతవరకు నిజమైతే ఉందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేసేంతవరకు ఇవన్నీ నిజాలా కాదా అనేది కూడా ఎవరికి తెలియదు. కాబట్టి రాజమౌళి నుంచి ఒక వార్త బయటకి వస్తే తప్ప వీటన్నింటికి చెక్ పడే అవకాశాలైతే లేవు…