https://oktelugu.com/

Dhee Celebrity Special: హైపర్ ఆది కామెంట్స్ కి హర్ట్ అయిన హీరోయిన్ హన్సిక… అందరి ముందే స్ట్రాంగ్ వార్నింగ్

శేఖర్ మాస్టర్, హైపర్ ఆది కాంబో సూపర్ గా ఫన్ జనరేట్ అవుతుంది. ఇక తాజా ఎపిసోడ్ లో గెస్ట్ గా యంగ్ హీరో సుధీర్ బాబు వచ్చారు. తన లేటెస్ట్ మూవీ హరోం హర ప్రమోషన్స్ లో భాగంగా షోలో సందడి చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 9, 2024 / 03:29 PM IST

    Dhee Celebrity Special

    Follow us on

    Dhee Celebrity Special: ఢీ సెలెబ్రెటీ స్పెషల్ సీజన్ 2 తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి వారంలో రెండు రోజులు ఢీ ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల అయింది. చాలా ఎంటర్టైనింగ్ గా నవ్వులు పూయించే విధంగా ప్రోమో ఉంది. ఇక హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలానే తన కామెడీ టైమింగ్, పంచులతో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు.

    శేఖర్ మాస్టర్, హైపర్ ఆది కాంబో సూపర్ గా ఫన్ జనరేట్ అవుతుంది. ఇక తాజా ఎపిసోడ్ లో గెస్ట్ గా యంగ్ హీరో సుధీర్ బాబు వచ్చారు. తన లేటెస్ట్ మూవీ హరోం హర ప్రమోషన్స్ లో భాగంగా షోలో సందడి చేశారు. సుధీర్ బాబు ముందు శేఖర్ మాస్టర్ పరువు తీసేసాడు హైపర్ ఆది. ఆది మాట్లాడుతూ .. మీరు ఎస్ఎంఎస్ సినిమా ఒక్కసారే చేశారు. కానీ మీ సినిమా వచ్చినప్పటి నుంచి కొందరికి రోజు శేఖర్ మాస్టర్ ఎస్ఎంఎస్ లు చేస్తూనే ఉంటారు అని సెటైర్ వేశాడు.

    ఆది అంతటితో ఆగలేదు. మీ ప్రేమ కదా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు కదా .. కానీ శేఖర్ మాస్టర్ ని చూస్తే ఆ దెయ్యమే పారిపోతుంది అంటూ పంచులు వేసి శేఖర్ మాస్టర్ పరువు తీసేసాడు. దీంతో కొత్త జడ్జి హన్సిక హైపర్ ఆది కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ ఏ ఆది… శేఖర్ మాస్టర్ చాలా మంచివారు .. నువ్వు నోరు మూసుకో’ అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో హైపర్ ఆది నాలుగు రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అని అంటాడు.

    దీంతో ‘నాలుగు రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో’ అని హన్సిక చెప్పడంతో ఆది ఫ్యూజులు అవుట్ అయ్యాయి. హన్సిక ఇచ్చిన కౌంటర్ కి ఆది షాకింగ్ ఎక్సప్రెషన్స్ పెట్టాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. కాగా ఈ ఎపిసోడ్ బుధవారం ఈటీవీలో ప్రసారం కానుంది. ఇదంతా ఫన్ లో భాగమే. హన్సిక ఢీ జడ్జిగా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి…