Yellamma Movie Latest Update: ‘బలగం’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు వేణు…ఈయన గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు కమెడియన్ గా సత్తా చాటుకున్నాడు. తనలో ఒక దర్శకుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తించి బలగం సినిమా చేశాడు. దాంతో ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. ఆ మూవీ వచ్చి మూడు సంవత్సరాలు దాటుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన మరొక సినిమాను అయితే స్టార్ట్ చేయలేదు. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరో ఎవరు? అనే దాని మీద సరైన క్లారిటీ రాకుండా పోయింది…
ఎప్పటికప్పుడు ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికి వాటి మీద సినిమా యూనిట్ మాత్రం ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇందులో హీరోగా నటిస్తున్నాడట. ఇక రీసెంట్ గా దదేవి శ్రీ ప్రసాద్ మీద ఒక షూట్ కూడా చేశారట. అందులోను ఊర్లల్లో ఉండే జనాలు ఎల్లమ్మను ఎలా నమ్ముతారు. ఎల్లమ్మ పూనిన వ్యక్తి ఎలా బీహేవ్ చేస్తాడు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ ఇందులో హీరోగా చేస్తున్న విషయాన్ని డైరెక్ట్ గా టైటిల్ అనౌన్స్ మెంట్ తో రీవిల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీ లో రహస్యంగా ఈ మూవీ షూటింగ్ చేశారు. వేణు తొందరలోనే సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక గ్లింప్స్ ఉన్నాడు. అలాగే హీరో మీద వస్తున్నా వార్తలకు చెక్ పెట్టబోతున్నట్టుగా కాబట్టి తెలుస్తోంది… సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ కి బాగా సెట్ అవుతాడని కొంతమంది అంటుంటే, విలీజ్ కాన్సెప్ట్ తో ఈ మూవీకి దేవి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది వల్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక వేణు సైతం ఈ సినిమా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక బలగం మూవీ కి ఎలాంటి పేరు వచ్చిందో, ఈ మూవీతో కూడా అలాంటి గొప్ప పేరు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని వేణు ముందుకు సాగుతున్నాడు…