https://oktelugu.com/

Kanishka Soni: వింత పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్.. పైగా శృంగారానికి మగాడు అవసరం లేదట !

Kanishka Soni: పెళ్లి అంటే.. వ‌ధువు, వ‌రుడు, పందిళ్లు, వేద మంత్రాలు , తాళాలు, తప్పెట్లు, తలంబ్రాలు… ఇలా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. కానీ, కాలం మారింది. ఇప్పుడు వింత పెళ్లిళ్లు గురించి ఎన్నో వింటున్నాం, నిత్యం టీవీల్లో ఎన్నో చూస్తున్నాం. ఈ కోవలోనే ఓ నటి తనను తాను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పైగా . శృంగారానికి పురుషుడు అవసరం లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరు ఆ నటి ?, ఏమిటి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 20, 2022 / 03:49 PM IST
    Follow us on

    Kanishka Soni: పెళ్లి అంటే.. వ‌ధువు, వ‌రుడు, పందిళ్లు, వేద మంత్రాలు , తాళాలు, తప్పెట్లు, తలంబ్రాలు… ఇలా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. కానీ, కాలం మారింది. ఇప్పుడు వింత పెళ్లిళ్లు గురించి ఎన్నో వింటున్నాం, నిత్యం టీవీల్లో ఎన్నో చూస్తున్నాం. ఈ కోవలోనే ఓ నటి తనను తాను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పైగా . శృంగారానికి పురుషుడు అవసరం లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరు ఆ నటి ?, ఏమిటి ఆమె కథ ? చూద్దాం రండి.

    Kanishka Soni

    ప్రముఖ టీవీ నటి.. ‘దియా ఔర్ బాతీ హమ్’ ఫేమ్.. కనిష్క సోని తనను తాను పెళ్లి చేసుకుంది. తనను తానే స్వీయ వివాహం చేసుకున్నాను అని ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా కనిష్క సోని ప్రకటించింది. పైగా పాపిట సింధూరం, మెడలో మంగళసూత్రం ధరించిన ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంది. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    Also Read: PV Sindhu: ప్రభాస్ అంటే పిచ్చి.. కోచ్ గోపీచంద్ వల్లే అకాడమీ నుంచి బయటకు.. ఓపెన్ అయిన పీవీ సింధు

    ఇంతకీ ఈ బ్యూటీ స్వీయ వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ?, ఆమెకు ఎందుకు ఈ ఆలోచన కలిగింది ? వంటి విషయాల గురించి చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యాయి. అందుకే, ఇప్పుడు ఆడవాళ్లకు శృంగారం కోసం మగవాడు అవసరం లేదు’. వాస్తవానికి పెళ్లి అనేది నా చిరకాల వాంఛ. కానీ, నా జీవితంలో నిజమైన మగాడు నాకు తగలలేదు. అందుకే, ఏ మగాడితో సంబంధం లేకుండా.. జీవితాంతం గడపాలని నిర్ణయించుకున్నాను’ అని కనిష్క సోని షాకింగ్ కామెంట్స్ చేసింది.

    అసలు ఈ బ్యూటీ ఇలా చేయడంతో అందరూ షాక్ అయ్యారు. నిజానికి కనిష్క సోని గుజరాత్‌కు చెందిన చాలా సంప్రదాయవాద కుటుంబం నుంచి వచ్చింది. పైగా ఆమె ఎంతో పద్ధతిగా ఉంటుంది. అయినా కనిష్క సోని స్వీయ వివాహం చేసుకుంది. ఆమె ఇలా చేయడానికి ప్రధాన కారణం లవ్ ఫెయిల్యూరే. మూడు సార్లు ప్రేమలో కనిష్క సోని విఫలం అయింది. అందుకే, ఇక తన జీవితంలో మగాడు ఉండకూడదు అని కనిష్క సోని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇలా తనను తానే పెళ్లి చేసుకుంది.

    Kanishka Soni

    కనిష్క సోని మంచి నటినే. గతంలో ఆమె మహాబలి హనుమాన్ వంటి షోలలో దేవతల పాత్రల్లో నటించింది. కానీ, సినిమా వాళ్ళు ఎవరూ ఆమెను నటిగా పెద్దగా గుర్తించలేదు. అయితే, కనిష్క సోని.. దియా ఔర్ బాతీ హమ్ టీవీ షో ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, పవిత్ర రిష్ట, దేవోంకే దేవ్ మహదేవ్, బాల్ వీర్, మహా భారత్ వంటి ఎన్నో టీవీ షోల్లో ఆమె నటించి మెప్పించింది .

    ఏది ఏమైనా తనకు తానే మూడు ముళ్లు వేసుకుని, తనతో తానే ఏడు అడుగులు నడిచి తనకు తానే భర్తగానూ, భార్యగానూ మారిపోయింది కనిష్క సోని. జీవితాంతం గుర్తుండే మధుర కమనీయ ఘ‌ట్టాన్ని తనకు తానే అనుభవిస్తోంది. మొత్తానికి కనిష్క సోని పెళ్లి మాత్రం చాలా విభిన్నం.

    Also Read:Deepika Ranveer New House: దీపికా – రణవీర్ కొత్త ఇల్లు చూస్తే షాక్ అవుతారు ?.. ఈ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ?

     

     

    Tags