https://oktelugu.com/

Tejaswi Madivada: ఆ రాత్రి వాళ్ళు నన్ను తాకరాని చోట్ల తాకుతూ కొరికారు.. తెలుగు హీరోయిన్ సంచలన కామెంట్స్ !

Tejaswi Madivada: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో దర్శనమిచ్చింది తేజస్వి మదివాడ, ఆ తర్వాత పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో ఫుల్ బిజీగా మారింది. మధ్యలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఏది ఏమైనా అందరూ ఆశర్యపోయేలా స్కిన్ షోతో కేక పుట్టిస్తూ తనకు తానే సాటి అనుకునేలా కొన్నాళ్లపాటు కెరీర్ ను కొనసాగించింది. అయితే, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా ఛాన్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 20, 2022 / 04:01 PM IST
    Follow us on

    Tejaswi Madivada: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో దర్శనమిచ్చింది తేజస్వి మదివాడ, ఆ తర్వాత పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో ఫుల్ బిజీగా మారింది. మధ్యలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఏది ఏమైనా అందరూ ఆశర్యపోయేలా స్కిన్ షోతో కేక పుట్టిస్తూ తనకు తానే సాటి అనుకునేలా కొన్నాళ్లపాటు కెరీర్ ను కొనసాగించింది. అయితే, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా ఛాన్స్ లను అందుకోలేకపోయింది. అయితే, చాలా గ్యాప్ తర్వాత తేజస్వి మడివాడ నటించిన తాజా చిత్రం ‘కమిట్మెంట్’.

    Tejaswi Madivada

    శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు, అసభ్యకరమైన డైలాగుల కారణంగా నా పై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. నా పై జరిగిన దాడుల గురించి ఎవరికీ తెలియదు. అలాంటి విషయాలనే మా సినిమాలో చూపించాం.

    Also Read: Kanishka Soni: వింత పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్.. పైగా శృంగారానికి మగాడు అవసరం లేదట !

    ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి ?, అమ్మాయిలను ఎలా వాడుకుంటారు ?, ఎంత పచ్చిగా వారిని అనుభవిస్తారు ? లాంటి విషయాలను ఈ సినిమాలో చూపించాం’ అని తేజస్వి చెప్పుకొచ్చింది. ఇక నాకు పర్సనల్ గా ఎదురైన ఒక సంఘటన గురించి చెబుతాను. ‘ఒకసారి నేను ఈవెంట్ నుంచి ఇంటికి వెళుతున్నాయి. బాగా రాత్రి అయింది. ఆ టైంలో 30 మంది తాగేసి వచ్చి నాపై రొమాంటిక్ దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టు నన్ను తాకరాని చోట్ల తాకుతూ కొరికారు.

    వారి నుంచి తప్పించుకోవడం నాకు కష్టంగా మారింది. వాళ్ళు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. చివరకు, వారి నుంచి తప్పించుకుని ఆ రాత్రి ఇంటికి చేరుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఆ సంఘటన తలుచుకుని నేను ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. బయట అమ్మాయిల పరిస్థితి ఇది. అమ్మాయిల పై ఇంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు.

    Tejaswi Madivada

    ఇక ఇండస్ట్రీలో కూడా చాలా సంఘటనల గురించి చెప్పొచ్చు. నాకు, కాస్టింగ్ కౌచ్ బాగా ఎదురైంది. కొందరు ఫోన్ చేసి కమిట్మెంట్ అడుగుతారు. కొందరు మాటలతో చెప్పరు. వాళ్ళ చూపులోనే ఏదో ఆశిస్తున్నారని మనకు అర్థం అవుతుంది. అవన్నీ మనం అర్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే.. అమ్మాయిలు ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా బతకలేరు.

    ఇప్పటికే, అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అయిపోయింది. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని విషయాలు ఇప్పుడు చాలా ఈజీగా బయటకు వస్తున్నాయి’ అని మొత్తానికి తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక తేజస్వి సినిమాల విషయానికి వస్తే.. టీవీ షోల్లో గాని, సినిమాల్లో గాని ఎక్కడా అవకాశం వచ్చినా అక్కడ వాలిపోతూ చాన్స్ లను ఒడిసి పట్టుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. మరి ఈ నెట్టుడు ఎన్నాళ్ళో ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే, తేజస్వి చేతిలో హీరోయిన్ గా మరో ఏ సినిమా లేదు.

    Also Read:Deepika Ranveer New House: దీపికా – రణవీర్ కొత్త ఇల్లు చూస్తే షాక్ అవుతారు ?.. ఈ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ?

     

     

    Tags