Telangana Single Screen Parking Free: తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యాలకు హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఇది ప్రేక్షకులకు శుభవార్త లాంటిదే. ఇక పై సింగల్ స్క్రీన్స్ లో పార్కింగ్ ఫీజు ని వసూలు చేయరాదని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం గతం లో ఇచ్చిన 121 జీవోను సస్పెండ్ చేసింది. ఈ జీవో సారాంశం, సింగిల్ స్క్రీన్స్ లో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని. ఇలా చేసినందుకు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ హై కోర్టు కి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యాలు పార్కింగ్ ఫీజుల పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నారని, బైక్ ని పార్కింగ్ చేయడానికి ఏకంగా 20 నుండి 25 రూపాయిలు తీసుకుంటున్నారని , ఇది నిలువు దోపిడీ అని అంటున్నారు.
Also Read: అల్లు శిరీష్ పెళ్ళిలో అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..? వీడియో వైరల్!
పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ యాజమాన్యానికి కేవలం పార్కింగ్ ద్వారా ఒక్కో షో కి 10 వేల రూపాయిల ఆదాయం కలుగుతుందని విశ్లేషకుల అంచనా. ఇప్పుడు హై కోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం వల్ల, అదంతా నష్టపోయినట్టే. పార్కింగ్ ద్వారా థియేటర్స్ యాజమాన్యానికి అన్ని సందర్భాల్లో లాభాలు ఉండవని, కేవలం స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు, లేదా ఏదైనా భారీ సూపర్ హిట్ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే వాటి వల్ల లాభాలు ఉంటాయని, అది కూడా కట్ చేయడం అన్యాయమంటూ థియేటర్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇండస్ట్రీ లో సంవత్సరానికి పట్టు మని పది సూపర్ హిట్ సినిమాలు కూడా రావడం లేదని, పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యినప్పుడు కేవలం వీకెండ్ వరకు మాత్రమే భారీ వసూళ్లు నమోదు అవుతాయి , ఆ సమయం లో మాత్రమే లాభాలు వస్తాయి, వాళ్ళవి కూడా ఫ్లాప్ అయ్యినప్పుడు ఈమధ్య కాలంలో రెండవ రోజు నుండే భారీ డ్రాప్స్ నమోదు అవుతున్నాయి.
హై కోర్టు సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు వరుసగా తీసుకుంటుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇష్టానుసారం తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంచడానికి వీలు లేదని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు. ఇప్పుడు పార్కింగ్ ఫీజులపైన కూడా వేటు వేసింది. అత్యవసరమైన ఎన్నో వాటిని సామాన్యులకు అందనంత రేంజ్ లో అమ్ముతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో విద్య ఎంత కాస్ట్లీ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలా ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్యం వంటి విషయాల్లో కోర్టు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా , సంక్రాంతి సీజన్ కి తప్ప, ఏడాది మొత్తం నష్టాల్లో ఉండే సినీ పరిశ్రమ పై ఎందుకు ఇంత పగబట్టింది అంటూ నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.