
Tollywood Telangana : తెలంగాణ భాష, యాసా అనగానే పదేళ్ల క్రితం తెలుగు సినిమాలో విలనిజం స్లాంగ్‌గా భావించేవారు. విలన్ క్యారెక్టర్స్‌కు మాత్రమే హైదరాబాద్ స్లాంగ్.. తెలంగాణ యాస వాడేవారు. ఎప్పుడైతే మా పాలన మాకే అని ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం మొదలైందో.. పరిస్థితి మారుతూ వచ్చింది. కొన్నాళ్లకు తెలంగాణ యాసను విలనిజం నుంచి తప్పించారు దర్శక నిర్మాతలు. తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది. అప్పటి వరకు తెలంగాణ కళాకారులకు సినిమాల్లో అవకాశాలు రావడమే అరుదుగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి తెలంగాణ టాలెంట్ తెరపై ప్రదర్శితమౌతోంది. టెన్నీషియన్స్‌గా, లైట్‌మెన్స్‌గా ఉన్న వారు సినిమాలకు దర్శకులుగా, నిర్మాతలుగా మారారు. తమ టాలెంట్‌తో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే దసరాలో వచ్చిన చమ్కీల అంగేసి.. పాటకు వస్తున్న ఆదరణను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
అచ్చమైన తెలంగాణ పదాలతో..
దసరా సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే పూర్తిగా తెలంగాణ మాండలికం, తెలంగాణ ప్రాంతం నేపథ్యంలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇందులోని చమ్కీల అంగేలేసి.. పాటలో రచయిత పొందు పర్చిన అచ్చమైన తెలంగాణ పదాలు వినేవారంతా ఎంత ముంద్దుగున్నది పాట అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక యువతులు, మహిళలు అయితే రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. అచ్చమైన తెలంగాణ పాట అద్భుతంగా ఉందని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు.. ఇంకోవైపు కొంతమంది కుహాన తెలుగు వాదులు.. ఇందులో తెలుగు ఎక్కడుందని, మరికొందరు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయండి, సబ్ టైటిల్స్ వేయండి అని పిచ్చిపిచ్చి కామెంట్స్ పెడుతున్నారు.
సంగీతానికి భాష.. భావం తప్ప..
సంగీతానికి భాష ఉండదు భావ తప్ప.. మంచి సంగీతాన్ని భాషకు అతీతంగా భారతీయులు ఆదరిస్తున్నారు. అందుకే నాటు నాటు పాట పాటకు ప్రపంచమే స్టెప్పులేసింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ ఆ పాటను వరించాయి. ఇక తెలుగు, హిందీ, తమిళం అని చూడకుండా మంచి సంగీతాన్ని సంగీత ప్రియులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. అంతెందుకు అరబిక్కుత్తు అనే పాటకు తెలుగు, తమిళం, హిందీ అని, దక్షిణాది ఉత్తరాది అని ప్రాంతీయ బేదం లేకుండా అందరూ ఆస్వాదించారు.. రీల్స్ చేశారు. తెలంగాణ భాషలో పాట అనేసరికి అందరికీ ఈర్శ పుట్టింది. అందుకే విమర్శలు చేయాలి.. కామెంట్స్ చేయాలి అన్నట్లుగా ట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు. రోజు మాట్లాడే పదాలే చమ్కీల అంగేసి… పాటలో ఉన్నాయి. అందరికీ నచ్చింది కాబట్టే లక్షల వ్యూస్, లైక్స్ ఆ పాటకు వస్తున్నాయి. రీల్స్ నెట్టింట్లో ట్రోల్ అవుతున్నాయి. కొంతమంది విమర్శలు, కావాలని క్రిటిసిజం చేసినంతమ మాత్రాన ఒరిగేదేమీ ఉండదు.
తెలంగాణే దిక్కు..
ఏళ్లుగా ఆంధ్రా యాసలో అర్థం కాని పదాలను తెలంగాణపై రుద్దారు ఆంధ్రా దర్శక నిర్మాతలు.. అక్కడి భాషతో సినిమాలు తీసినా తెలంగాణ ఆదరించింది. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది. నైజాం సీడెడ్‌లో కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో ఆంధ్రా భాష ఉంది అని రిజక్ట్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ భాష, యాసలో సినిమాలు వస్తూనే ఉన్నయ్.. వస్తయ్ కూడా ఇప్పటికే బలగం, దసరా, పరేషాన్, సత్తిగాని రెండెకరాలు అనుకుంటూ తెలంగాణ యాసలో వచ్చిన సినిమాల్లా అనేక సినిమాలు బాజాప్త వస్తయ్.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ యాస భాషే దిక్కయ్యే పరిస్థితి కూడా వస్తది అంటున్నారు తెలంగాణ సినీ విమర్శకులు.