Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయన నటించిన ర్యాపిడో యాడ్‌పై తెలంగాణ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ యాడ్ లో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో కంపెనీకి లీగల్ నోటీసులు పంపించారు. ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చడం సబబు కాదని చెప్పారు. ఈ రకంగా ఆర్టీసిని తగ్గించడం పట్ల ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

అలానే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆ ప్రకటన లో అల్లు అర్జున్ దోశ మాస్టర్ గా కనిపిస్తున్నాడు. దోశ తినాలంటే రెండే అంటు డైలాగ్ చెబుతాడు. చివరగా దోశ తినడానికి బస్సులలో ఇబ్బంది పడేకంటే రాపిడో బైక్ బుక్ చేసుకుని సులువుగా దోశ తిని రావాలని అంటాడు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు అని అల్లు అర్జున్ చెబుతాడు. ప్రస్తుతం ఈ వార్త మీడియా లో వైరల్ గా మారింది.
