https://oktelugu.com/

Bangarraju Movie: బంగార్రాజు సినిమా నుంచి “లడ్డుందా” సాంగ్ రిలీజ్… ఈ పాట ఎవరు పాడారంటే ?

Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే  చెప్పాలి. ఒక వైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాగార్జున ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం ఆనందంలో ఉన్నారనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు…  మంచి విజయం సాధించాయి. ఇప్పుడు నాగ్ కూడా హిట్ ను ఖాతాలో వేసుకోవడానికి రెడీ […]

Written By: , Updated On : November 9, 2021 / 10:01 AM IST
Follow us on

Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే  చెప్పాలి. ఒక వైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాగార్జున ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం ఆనందంలో ఉన్నారనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు…  మంచి విజయం సాధించాయి. ఇప్పుడు నాగ్ కూడా హిట్ ను ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు.

laddunda song released from nagarjuna bangarraju movie

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.  ఈ సినిమా నుంచి లడ్డుండా అనే ఊర మాస్‌ సాంగ్‌ ను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్‌ ను స్వయంగా నాగార్జునే పాడడం విశేషం అని చెప్పాలి. దీంతో మాస్‌ ప్రేక్షకులను ఈ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతో భారీ విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నాగ్‌ కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్‌ పతాకం పై నాగార్జున ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అలానే మరో వైపు నాగార్జున ” ది ఘోస్ట్ ” అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా… అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తుంది.