https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ పై తెలంగాణ ACP ఫైర్..నేను తల్చుకుంటే బయట అడుగుకూడా పెట్టలేవ్ అంటూ వార్నింగ్!

ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసు లో ముద్దాయిగా ఉన్నాడు. రూల్స్ ప్రకారం ముద్దాయి జరిగిన ఘటనపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు. కానీ అల్లు అర్జున్ మాట్లాడడం పై తెలంగాణ ఏసీపీ విష్ణు మూర్తి నేడు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ని పెట్టి అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 04:46 PM IST

    Allu Arjun(9)

    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం లో ఫైర్ అయిన ఘటన ఎంతటి సంచలనాలకు దారీ తీసిందో మన అందరికీ తెలిసిందే. డిసెంబర్ నాల్గవ తేదీన ‘పుష్ప 2 ‘ ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ రావడం, ఆ తర్వాత తొక్కిసిలాట లో రేవతి చనిపోయిన ఘటన గురించి వివరిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసు లో ముద్దాయిగా ఉన్నాడు. రూల్స్ ప్రకారం ముద్దాయి జరిగిన ఘటనపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు. కానీ అల్లు అర్జున్ మాట్లాడడం పై తెలంగాణ ఏసీపీ విష్ణు మూర్తి నేడు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ని పెట్టి అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు రాత్రి 10 వేల మంది జనాలు ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి 50 మంది పోలీసులు కూడా లేరక్కడ. మా పరిధిలో ఉన్న పోలీస్ స్టాఫ్ మొత్తం వచ్చి పని చేస్తున్నా కూడా నువ్వు పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావంటే, నీకు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా, లేక మాట్లాడుతున్నావా అనే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రతీ సామాన్యుడికి ఉన్న బాధ్యత రాజ్యాంగం, చట్టం గురించి తెలుసుకోవడం. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు పోలీసులను తప్పుబట్టి, ప్రెస్ మీట్ లు పెడుతున్నావు. కోర్టు లో కేసు నడుస్తుంది, నువ్వు ముద్దాయివి, అయినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడేస్తావా?, నువ్వు ఏమైనా పైన నుండి దిగి వచ్చాను అనుకుంటున్నావా?, చట్టం అందరికి ఒక్కటే, పాటించకపోతే జైలు లో కూర్చోవాల్సిందే’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.

    సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోలీసులను బూతులు తిడుతూ మాట్లాడడం పై ఏసీపీ స్పందిస్తూ ‘ సోషల్ మీడియా లో కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు పోలీసులపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. పోలీసులు ఒక్కసారి అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మేము చేసేది మీకు తప్పు అనిపిస్తే చట్టబద్ధంగా వెళ్లి మాపై ఫిర్యాదులు చేసుకోండి. అంతే కానీ పోలీసులపై నోరు పారేసుకుంటే మాత్రం మీ రీల్స్ కట్ అయిపోతాయి. కాబట్టి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయండి’ అంటూ ఈ సందర్భంగా ఆయన హెచ్చరించాడు. మరి కోర్టు కేసు నడుస్తున్నప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా కాదా?, ఒకవేళ ఆయన చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయితే కోర్టు ఆయనకీ ఇచ్చిన ఇంటెర్మ్ బెయిల్ ని రద్దు చేస్తుందా?, లేదా రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కి ఇవ్వకుండా ఆపుతుందా అనేది చూడాలి.