Game Changer: డిసెంబర్ నెల మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మేనియా తో నిండిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం జోరు చివరి దశకు దాదాపుగా వచ్చేసింది. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ తో ఈ చిత్రం రన్ పూర్తి అయ్యినట్టే. ఆ తర్వాత కూడా కలెక్షన్స్ వస్తాయి కానీ, ఇప్పుడొచ్చిన రేంజ్ వసూళ్లు రావడం కష్టమే. అయితే ఇప్పుడు నెమ్మదిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మేనియా ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి. కేవలం కొన్ని షోస్ కి మాత్రమే బుకింగ్స్ ప్రారంభించగా, వాటి నుండే ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నేడు పట్టరాని ఆనందం దక్కింది అని చెప్పొచ్చు.
ఈ సినిమా సంబంధించిన మొదటి ఈవెంట్ ని నేడు నార్త్ అమెరికా లోని డల్లాస్ ప్రాంతం లో చేసారు. రామ్ చరణ్, శంకర్ తో పాటు మూవీ టీం మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొని, సినిమా గురించి అద్భుతంగా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడిన మాటలను చూస్తుంటే రామ్ చరణ్ మరోసారి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ స్పీచ్ విన్న తర్వాత అభిమానులు కచ్చితంగా ఈ చిత్రం ఘన విజయం సాదిస్తుందని నమ్ముతున్నారు. ఇంతకీ ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘డల్లాస్ లో నాకు ఈ స్థాయిలో స్వాగతం పలికిన అభిమానులకు కృతఙ్ఞతలు. మీ ప్రేమని వెలకట్టలేము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన అభిమానులతో కలిసి ఒక సెల్ఫీ వీడియో ని తీసుకున్నాడు. ఈ వీడియో ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేసాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘ఈ చిత్రం శంకర్ గారి అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లాంటిది. ఇప్పటి వరకు ఆయన ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తియ్యలేదు. చాలా అద్భుతంగా ఈ చిత్రం వచ్చింది. ఎస్ జె సూర్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బయట ఆయన ఎలా ఉంటాడో, ఈ సినిమాలో కూడా ఆయన అంతే వైల్డ్ గా ఉన్నట్టు అనిపించింది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉంటాయి. నా కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అలాంటి సన్నివేశాలను ఇచ్చినందుకు శంకర్ గారికి కృతఙ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అభిమానులందరూ ఓజీ..ఓజీ అని అరుస్తుండగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘నేను కూడా మీలాగే ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతికి రాకపొయ్యుంటే, బాబాయ్ ని పట్టుబట్టి ఓజీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయించేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.