https://oktelugu.com/

చాలా మంది బెడ్‌ రూమ్‌కు రమ్మన్నారు..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. భాష, ప్రాంతంతో తేడాలేకుండా అన్ని చోట్లా ఈ పాడు సంస్కృతి ఉంది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ వరకు.. అవకాశాల పేరుతో లైంగిక వాంఛ తీర్చుకునే వాళ్లు ఉన్నారు. దీనిపై ‘మీ టూ’ పేరుతో అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ప్రకటించారు. దాంతో, హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అనేక భాషల దర్శక, నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణుల దుర్భుద్ధి బట్టబయలైంది. […]

Written By:
  • admin
  • , Updated On : June 13, 2020 / 03:49 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. భాష, ప్రాంతంతో తేడాలేకుండా అన్ని చోట్లా ఈ పాడు సంస్కృతి ఉంది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ వరకు.. అవకాశాల పేరుతో లైంగిక వాంఛ తీర్చుకునే వాళ్లు ఉన్నారు. దీనిపై ‘మీ టూ’ పేరుతో అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ప్రకటించారు. దాంతో, హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అనేక భాషల దర్శక, నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణుల దుర్భుద్ధి బట్టబయలైంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ పై పలువురు తెలుగు హీరోయిన్లు సైతం గళం విప్పారు. శ్రీరెడ్డి, మాధవీలత తదితరులు దీనిపై పోరాడారు.

    తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ తేజస్వి కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తాజా చిత్రం ‘కమిట్‌మెంట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. సినీ పరిశ్రమలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని, కమిట్‌మెంట్ పేరుతో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్‌ని లైంగికంగా లొంగదీసుకుంటున్నారంది. అలా కమిట్‌మెంట్లకు ఒప్పుకున్న వాళ్లకే అవకాశాలు ఇస్తారని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తనను కూడా చాలా మంది బెడ్‌ రూమ్‌కు పిలిచారని.. అందుకు ఒప్పుకోకపోవడం వల్లే కెరీర్లో తగిన సక్సెస్ సాధించేకపోయానని వెల్లడింది. అంతేకాదు తనకు తెలిసిన హీరోయిన్లలో చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఉన్నాయని చెప్పింది. అయితే, ఇలాంటి అనుభవాలను బయటకు చెప్పేందుకు వాళ్లు ముందుకు రావడం లేదని తెలిపింది.

    ముంబై హీరోయిన్లు అన్నింటికీ రెడీ
    ముంబై నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అవుతున్న హీరోయిన్లు దేనికైనా సిద్ధపడే వస్తున్నారని తేజస్వి చెప్పింది. వాళ్లు కమిట్ మెంట్లకు సిద్ధంగా ఉంటారు కాబట్టే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని కుండబద్దలు కొట్టింది. బెడ్‌ రూమ్‌కు వస్తామంటే బ్రేక్‌ ఇచ్చేందుకు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారని చెప్పింది. అలాంటి వాళ్లను దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్ళు కనిపిస్తారని తెలిపింది. కానీ, ముంబై నుంచి వస్తున్న హీరోయిన్లు కమిట్‌మెంట్స్‌కు ఒప్పుకోవడం వల్లే తెలుగు అమ్మాయిలకు కూడా చెడ్డపేరు వస్తోందని తేజస్వి వాపోయింది. గతంలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, పెళ్లికి కూడా సిద్ధమయ్యామని చెప్పిన యువ నటి.. కాస్టింగ్‌ కౌచ్‌ అంశం కారణంగానే ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో తనకు ఆఫర్ వచ్చిందని తేజస్వి తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఆ సిరీస్‌లో తాను నగ్నంగా నటించాల్సి ఉంటుందని చెప్పారంది. అది ఇషం లేక ఆ ఆఫర్ వదులుకున్నానని తెలిపింది.