Star directors Remuneration : రెమ్యూనరేషన్స్ ను భారీ గా పెంచేసిన మన స్టార్ డైరెక్టర్లు…

ఒక సినిమా సక్సెస్ అవ్వాలన్న, ఫెయిల్యూర్ గా నిలవాలన్న దానికి మూల కారణం ఆ సినిమా దర్శకుడే...కాబట్టి డైరెక్టర్ ఒక సినిమాను సక్సెస్ చేయడానికి తను పెట్టే ఎఫర్ట్స్ కూడా భారీ రేంజ్ లో ఉంటాయి...

Written By: Gopi, Updated On : August 25, 2024 7:39 pm

Star directors Remuneration

Follow us on

Star directors Remuneration :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు వరుస సినిమాలను చేస్తూ వాళ్ళ పేరు ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోవడానికి చాలా రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ వరల్డ్ లెవెల్లో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మిగతా దర్శకులు పాన్ ఇండియాలో తమ సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక సుకుమార్ లాంటి దర్శకుడు పాన్ ఇండియాలో పుష్ప సినిమాతో ఇప్పటికే తన స్టామినా ఏంటో చూపించి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మరొకసారి పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళిని మినహాయిస్తే మిగిలిన స్టార్ డైరెక్టర్లలందరూ ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…

ముందుగా సుకుమార్ విషయానికి వస్తే ఈయన ‘పుష్ప ‘ సినిమాకి ముందు వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకొని ఇండియా వైడ్ గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది…

కల్కి సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న నాగశ్విన్ ఇప్పుడు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి నాగ్ అశ్విన్ తీసిన సినిమాలు అన్నీ వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కాయి. అయినప్పటికీ తను కూడా రెమ్యూనరేషన్ రూపంలోనే తన అమౌంట్ ని తీసుకుని మిగతది ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ కింద చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి తను ఒక సినిమా కోసం దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

ప్రస్తుతం కొరటాల శివ కూడా దేవర సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లోకి అడుగుపెడుతున్నాడు. కాబట్టి ఈయన కూడా దాదాపు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయన తన రెమ్యూనరేషన్ ని భారీ రేంజ్ లో పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి…

ఇలా పాన్ ఇండియా డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకుంటున్న ప్రతి ఒక్క దర్శకుడు వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేస్తున్నారు…