Tejaswi Madivada: ప్రైవేట్ ఫోటో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది తేజస్వి మడివాడ. తెలుగు అమ్మాయి తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. తేజస్వి మాదివాడ తాజాగా ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షేర్ చేశారు. ఒంటిపై బట్టలు లేకుండా టవల్ చుట్టుకొని, ఆమె బెడ్ పై పడుకొని ఫోజిచ్చారు. ప్రైవేట్ ఫోటోను తలపిస్తున్న ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. పచ్చి కామెంట్స్ తో రచ్చ షురూ చేశారు. తేజస్వి తీరుకు కొందరైతే హవ్వా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

హైదరాబాద్ లో పుట్టిన తేజస్వి మాదివాడకు కాలం కలిసి రాలేదు. ఆమెకు హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. అడపాదడపా అవకాశాలతోనే కెరీర్ ఫేడ్ అవుట్ దశకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న రోల్ చేశారు. ఐస్ క్రీమ్ మూవీతో హీరోయిన్ అయ్యారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సారథ్యంలో వచ్చిన ఐస్ క్రీమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దీంతో ఆమెకు సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినా కెరీర్ కి ఉపయోగపడలేదు. బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు చిత్రాల్లో తేజస్వి హీరోయిన్ పాత్రలు చేశారు. తేజస్వి నటించిన లేటెస్ట్ మూవీ కమిట్మెంట్. ఈ ఏడాది ఆగస్టులో కమిట్మెంట్ విడుదలైంది. చిత్ర ప్రమోషన్స్ కోసం కొన్ని వివాదాలు తెరపైకి తెచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్, అతని ఆర్మీ వలన మానసిక వేదనకు గురయ్యాను. ఆల్కహాల్ కి అలవాటు పడ్డాను, అని కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

తేజస్వి ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యం. కమిట్మెంట్ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చివరకు ఆమెకు నిరాశే మిగిలింది. కాగా తేజస్వి బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్నారు. హౌస్లో అందాల విందుకు తెరలేపారు. అయినప్పటికీ ఆమె ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆరో వారం తేజస్వి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ నాన్ స్టాప్ లో కూడా తేజస్వి పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా ఆమెకు దురదృష్టం ఎదురైంది. హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వి ప్రభావం చూపలేకపోయారు.