Teja vs Mahesh : గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి పండుగ రోజు ఆసక్తికరమైన పోటీ నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ‘గుంటూరు కారం’, తేజ సజ్జ(Teja Sajja) ‘హనుమాన్’ చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిల్లో ‘గుంటూరు కారం’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, తేజ సజ్జ ‘హనుమాన్’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సుమారుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఎదుట నిలబడి, అతి తక్కువ థియేటర్స్ తో ఈ రేంజ్ వసూళ్లు ఎలా వచ్చాయి?, కంటెంట్ ఉన్న సినిమాలు స్టార్ హీరోలను డామినేట్ చేసే పరిస్థితి ఇది వరకు బాలీవుడ్ లో ఉండేది, ఇప్పుడు టాలీవుడ్ కి కూడా ఎగబాకిందా? అనే అనుమానాలను రేకెత్తించేలా చేసింది గత సంక్రాంతి.
Also Read : ‘వార్ 2’ లో హృతిక్ రోషన్ కి జోడీగా కియారా అద్వానీ..మరి ఎన్టీఆర్ కి జోడీ ఎవరో తెలుసా!
అయితే తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్టు గా గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ‘యువరాజు’ చిత్రంలో కూడా తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్టు గా నటించాడు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఒక అబ్బాయి, పెద్దయ్యాక మహేష్ బాబు నే దాటేశాడు అంటూ సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ సాధారణమైనవి కావు. ఇప్పటికీ మహేష్ బాబు ని ట్రోల్ చెయ్యాలంటే ఈ అంశాన్ని ఉపయోగించుకొని ట్రోల్స్ చేస్తుంటారు ఆయన దురాభిమానులు. సోషల్ మీడియా లో ఇవన్నీ సర్వసాధారణమే. అయితే మళ్ళీ మహేష్ బాబు కి తేజ సజ్జ అడ్డు రాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో ‘మిరాయ్'(Mirai Movie) అనే సూపర్ హీరో జానర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడు.
దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగష్టు 1 న విడుదల చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘అతడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని తమ హీరో కొత్త సినిమాగా భావిస్తున్నారు. మార్కెట్ లో ఈ సినిమాపై ఉన్న హైప్ కూడా వేరే లెవెల్ అనొచ్చు. ఇప్పుడు మిరాయ్ చిత్రం ఆగష్టు 1 న విడుదల అవ్వడం వల్ల అతడు రీ రిలీజ్ చిత్రానికి టాప్ థియేటర్స్ దొరకకపోవచ్చు. మహేష్ గత రీ రిలీజ్ చిత్రాలకు ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడానికి ప్రధాన కారణం టాప్ థియేటర్స్ ని ఏరికోరి ఎంచుకోవడం వల్లే, ఇప్పుడు ఆ వెసులుబాటు మిరాయ్ కారణంగా మిస్ అయ్యే అవకాశం ఉండడం తో తేజ సజ్జ పై మహేష్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ మీద ఉన్నారు.