Teja Sajja Mirai Movie
Teja Sajja : బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జ(Teja Sajja). చిన్నతనంలో ఇతన్ని చూసినప్పుడు భవిష్యత్తులో హీరో అవుతాడో లేదో చెప్పలేకపోయారు కానీ, పెద్దయ్యాక కేవలం టాలీవుడ్ కి మాత్రమే అతగాడు పరిమితం కాలేదు, ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పై కన్నేశాడని ‘హనుమాన్’ చిత్రం చూసిన తర్వాతే తెలిసింది. ఈ చిత్రానికి ముందు తేజ సజ్జ ‘అద్భుతం’, ‘జాంబి రెడ్డి’, ‘ఇష్క్’ వంటి చిత్రాలు చేసాడు. వీటిల్లో జాంబి రెడ్డి మంచి హిట్ అయ్యింది కానీ, అతని మార్కెట్ పరిధి లో ఉన్నంత వరకే వసూళ్లను రాబట్టింది. కానీ ‘హనుమాన్'(Hanuman Movie) చిత్రం మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఒక సునామీ ని సృష్టించింది అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి ఎదురుగా నిలబడి, అతి తక్కువ థియేటర్స్ దొరికినప్పటికీ కూడా ఫుల్ రన్ లో ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.
ఈ సినిమా తర్వాత తేజ సజ్జ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక మీదట ఆయన చిన్న సినిమాలు చేయడని అర్థమైపోయింది. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్'(Mirai Movie) అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్నాడు. రవితేజ తో ఈగల్ వంటి చిత్రం తీసిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మంచు మనోజ్(Manchu Manoj) విలన్ గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదలయ్యాయి. రెండిటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మనోజ్ గ్లిమ్స్ పెద్ద హిట్ అయ్యింది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు కానీ, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మీడియం రేంజ్ హీరోలకు మించి ఉంది.
ఇప్పటికే ఆడియో రైట్స్ 2 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఓటీటీ రైట్స్ హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ, ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని మూవీ కి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఇప్పుడిప్పుడే ఈ రేంజ్ కి అమ్ముడుపోతున్నాయి. ఈ స్థాయికి ఆయన రావడానికి దాదాపుగా 20 సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ అవసరమైంది. అలాంటిది తేజ సజ్జ కేవలం రెండు మూడు సినిమాలతోనే ఆ రేంజ్ కి వచేసాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక తేజ సజ్జ ఏకంగా స్టార్ హీరోల లీగ్ లోకి వచ్చి కూర్చుంటాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇతగాడి కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.