https://oktelugu.com/

Vishvambhara Movie : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘విశ్వంభర’ హిందీ థియేట్రికల్ రైట్స్..’గేమ్ చేంజర్’, ‘దేవర’ కంటే ఎక్కువ!

'విశ్వంభర' టీజర్ ని చూసిన తర్వాత అంజి సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ చాలా వరకు బెటర్ అని అందరికీ అనిపించింది. అంతటి చీప్ క్వాలిటీ టీజర్ లో కనిపించింది. టీజర్ లో ఉన్నట్టుగానే, సినిమాలో కూడా ఉంటే మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమా మరో 'ఆచార్య', లేదా మరో 'భోళా శంకర్' అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ సినిమా కి జరుగుతున్న బిజినెస్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

Written By: , Updated On : February 21, 2025 / 07:11 PM IST
Vishvambhara movie

Vishvambhara movie

Follow us on

Vishvambhara Movie Movie : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేస్తున్న భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ చిత్రం ‘విశ్వంభర'(Vishvambhara Movie Movie). ‘భింబిసారా’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత డైరెక్టర్ వశిష్ఠ తీస్తున్న చిత్రమిది. ‘అంజి’ తర్వాత ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గ్రాఫిక్స్ సినిమా కూడా ఇదే. అయితే అప్పట్లో ‘అంజి’ చిత్రం పెద్ద ఫ్లాప్. కానీ ఆ సినిమాలోని గ్రాఫిక్స్ అప్పటి ఆడియన్స్ ని అబ్బురపరిచింది. కానీ ‘విశ్వంభర’ టీజర్ ని చూసిన తర్వాత అంజి సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ చాలా వరకు బెటర్ అని అందరికీ అనిపించింది. అంతటి చీప్ క్వాలిటీ టీజర్ లో కనిపించింది. టీజర్ లో ఉన్నట్టుగానే, సినిమాలో కూడా ఉంటే మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమా మరో ‘ఆచార్య’, లేదా మరో ‘భోళా శంకర్’ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ సినిమా కి జరుగుతున్న బిజినెస్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

టీజర్ సినిమాపై చాలా నెగటివిటీ తెచ్చింది కదా, బజ్ తగ్గిపోతుందేమో అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ ని చూస్తే అర్థం అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన హిందీ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 38 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకంటే ఇది చాలా ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘గేమ్ చేంజర్’, ‘దేవర’ చిత్రాలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదట. గేమ్ చిత్రానికి 34 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే, కేవలం 17 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది. అంటే 50 శాతం కి పైగా నష్టాలు అన్నమాట. పాన్ ఇండియా స్టార్ గా పిలవబడే రామ్ చరణ్(Global Star Ramcharan) కే వర్కౌట్ అవ్వలేదు, ఇక చిరంజీవి కి ఎలా అవుతుంది?, ఏ ధైర్యం తో అంత పెట్టి కొన్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసాడు. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ ని పెట్టుకున్నప్పటికీ కూడా వర్కౌట్ అవ్వలేదు. కనీసం 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా ఆ చిత్రానికి రాలేదు. అదే విధంగా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని కూడా హిందీ లో విడుదల చేసారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆ సినిమాకి కనీస స్థాయి వసూళ్లు రాలేదు. చిరంజీవి హిందీ లో ప్రస్తుతం అంత తక్కువ మార్కెట్ ఉంది. అయినప్పటికీ హిందీ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడుపోయాయంటే, కచ్చితంగా కంటెంట్ బలమైన దమ్ము ఉందని అభిమానులు అంటున్నారు. సినిమాలో కంటెంట్ ని చూసిన తర్వాతే ఆ రేంజ్ లో కొనుక్కున్నారంటూ మెగాస్టార్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.