‘ఓ బేబీ’ అంటూ ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించి, తనకున్న బాల నటుడు ఇమేజ్ ను కాస్త, హీరో ఇమేజ్ గా మార్చుకోవడానికి గట్టిగా హార్డ్ వర్క్ చేశాడు కుర్ర హీరో ‘తేజ సజ్జ’. దానికి తోడు జాంబీ రెడ్డి లాంటి వినూత్న సినిమాతో హీరోగా కూడా సక్సెస్ సాధించాడు కాబట్టి, కుర్రాడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి.
రేటింగ్స్ ఏవరేజ్ గా వచ్చినా, ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం జాంబీ రెడ్డిని తెగ చూశారు. ఆ కారణంగా ఎవరూ ఊహించని విధంగా జాంబీ రెడ్డి మంచి ప్రాఫిట్స్ నే అందుకోవడంతో పాటు రీమేక్ రైట్స్ పరంగా కూడా బాగా క్యాష్ చేసుకుంది. అందుకే అదే టీమ్ మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. శరవేగంగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి షూట్ కి అసలు గ్యాప్ కూడా ఇవ్వడం లేదు.
పైగా ప్రశాంత్ వర్మ ఈసారి మరో భిన్నమైన కథాంశంతో ఇప్పుడు చేస్తోన్న సినిమా కథ రాశాడు. టైటిల్ కూడా హనుమాన్ అని కొత్తగా పెట్టారు. క్రేజీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హై బడ్జెట్ ను కేటాయించడం కూడా నిజంగా విశేషమే. ఏది ఏమైనా ‘జాంబీ రెడ్డి’ సాధించిన లాభాలు, బాగానే పని చేస్తున్నాయి. తేజ సజ్జ కోసం కూడా కొత్త డైరెక్టర్లు ఎదురుచుస్తున్నారు.
సితార లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా తేజ సజ్జతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక చిన్నాచితకా నిర్మాణ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది ? మొత్తమ్మీద తేజకు మంచి డిమాండ్ క్రియేట్ అయింది. ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడు.
జాంబీ రెడ్డికి ముందు వరకూ లక్షల్లో ఉన్న తేజ పారితోషికం, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు దాటిందని టాక్. మరి కుర్రాడు ఇలా సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతే, అసలుకే మోసం వచ్చే పరిస్థితి వస్తోంది. కాబట్టి.. కుర్రాడు తన రెమ్యునరేషన్ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.