ప్చ్.. డబ్బులు ఇచ్చి మరీ నటిస్తున్న హీరో !

సినిమా ఇండస్ట్రీలో ఒకసారి టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు.. ఇక ఆ వ్యక్తి ఎప్పటికి టాలెంట్ పర్సనే అని ఇండస్ట్రీ బలంగా ఒక ముద్ర వేసుకుని దాన్నే ఫిక్స్ అయిపోతుంది. ప్రస్తుతం డైరక్టర్ ప్రశాంత్ వర్మ పరిస్థితి ఇలాగే ఉంది. అతనిలో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. కానీ, అతనొక సుకుమార్ అని తెగ ఫీల్ అయిపోతూ నిర్మాతల చేత అదనపు డబ్బు పెట్టిస్తేనే బాధ. గత సినిమాకి ఇలాగే చేశాడని విమర్శలున్నాయి. ఇంతకీ విషయంలో […]

Written By: admin, Updated On : June 26, 2021 2:49 pm
Follow us on

సినిమా ఇండస్ట్రీలో ఒకసారి టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు.. ఇక ఆ వ్యక్తి ఎప్పటికి టాలెంట్ పర్సనే అని ఇండస్ట్రీ బలంగా ఒక ముద్ర వేసుకుని దాన్నే ఫిక్స్ అయిపోతుంది. ప్రస్తుతం డైరక్టర్ ప్రశాంత్ వర్మ పరిస్థితి ఇలాగే ఉంది. అతనిలో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. కానీ, అతనొక సుకుమార్ అని తెగ ఫీల్ అయిపోతూ నిర్మాతల చేత అదనపు డబ్బు పెట్టిస్తేనే బాధ. గత సినిమాకి ఇలాగే చేశాడని విమర్శలున్నాయి.

ఇంతకీ విషయంలో వెళ్తే.. ప్రశాంత్ వర్మ ‘అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ సినిమాలు తీసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా కూడా భారీ హిట్ అని అనిపించుకున్న సినిమా ఒకటి లేదు. అయినా ప్రశాంత్ వర్మ ఏదో పెద్ద స్టార్ డైరెక్టర్ అన్నట్టు అతని కొత్త సినిమా విషయంలో బాగా హడావుడి జరుగుతుంది.

ప్రశాంత్ వర్మ తాజాగా ‘హను-మాన్’ అనే సినిమాని ప్రారంభించి వైల్డ్ ప్రమోషన్స్ కూడా చేయించుకున్నాడు. ఇది సూపర్ హీరో మూవీ అంటూ ‘బ్యాట్మాన్’, ‘సూపర్ మేన్’ వంటి సినిమాల తరహాలో ఈ సూపర్ హీరో సినిమా ఉంటుంది అంటూ తనకు తెలిసిన నాలుగు ప్రత్యేక పదాలను తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయాడు.

అయితే, సినిమాలో హీరో వచ్చేసి తన ‘జాంబిరెడ్డి’ హీరో తేజ సజ్జా. వాస్తవానికి ఈ సినిమాని నానితో చేయాలని ప్రశాంత్ వర్మ బాగా ప్రయత్నం చేశాడు. కానీ నాని ఉన్న బిజీ కారణంగా అలాగే కథ నచ్చకపోవడం కారణంగా నాని ఈ సినిమాని రిజక్ట్ చేశాడు. అవకాశం తేజ సజ్జాకు వెళ్ళింది. ఐతే ఈ వెళ్లడం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉందట.

తేజ సజ్జాకి ఫైనాన్షియల్ గా మంచి బ్యాకప్ ఉంది, తేజ సజ్జ ఈ సినిమాకి ఇన్ డైరెక్ట్ గా డబ్బులు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తేజ సజ్జా డబ్బులు ఇచ్చి మరీ నటిస్తున్నాడు అన్నమాట.