Teja comments on Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ తేజ (Teja)… చిత్రం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…ప్రేమ కథ చిత్రాలకు కొత్త అర్ధాన్ని చెప్పిన ఈ దర్శకుడి బాటలోనే చాలామంది దర్శకులు సినిమాలను చేసి సక్సెస్ లను సాధించారు. మరి ఏదిఏమైనా కూడా ఇప్పటికీ ఆయన చేసిన లవ్ స్టోరీస్ ని ఆధారంగా చేసుకొని కొన్ని సినిమాలను చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈయన మహేష్ బాబు (Mahesh Babu) తో నిజం అనే సినిమా చేశాడు. ఈ సినిమా కంటెంట్ పరంగా కొంత వీక్ గా ఉండడంతో మహేష్ బాబు స్టార్ డమ్ కి సరిపడా కథ కాకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికి మహేష్ బాబుకి మాత్రం చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. నటుడిగా తనకు నంది అవార్డు కూడా వచ్చింది.
మరి ఏది ఏమైనా కూడా తేజ (Teja) చేసిన ఈ సినిమా మహేష్ బాబు ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇక తేజ రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయన చేసిన సినిమాలన్నింటి గురించి మాట్లాడుతూ నేను సినిమాలు చేసిన హీరోలందరిలో మహేష్ బాబు మంచి నటుడు అని చెప్పాడు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) కంటే కూడా రానా (Rana) చాలా మంచి నటుడు అనా చెప్పాలి.
Also Read: Director Teja: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ నాతో చెప్పించాలి అనుకుంటున్నారు… డైరెక్టర్ తేజ కామెంట్స్!
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తున్న సమయంలో ఆ డైలాగ్ డెలివరీ ని ఒక డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడంటూ తేజ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఒక రకంగా మహేష్ బాబు కంటే కూడా రానా గొప్ప నటుడు అని ఆయన చెప్పడం మహేష్ బాబు అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతుంది.
ఇక బాహుబలి సినిమాలో రానా నటన చూసిన ప్రతి ఒక్కరు అతను చాలా మంచి నటుడు అంటూ ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించారు. తేజ చెప్పినట్టుగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా క్యారెక్టర్ లో వేరియేషన్స్ చాలా ఉంటాయి. వాటిని చాలా సెలెక్టెడ్ గా చేసుకుంటూ ముందుకు సాగిన రానా ఫ్యూచర్ లో మరిన్ని గొప్ప క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…