Teja And Nithin Clash: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోలను పరిచయం చేసిన ఘనత తేజకే దక్కుతోంది. మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన తేజ ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘చిత్రం’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన రెండో సినిమాగా చేసిన ‘నువ్వు నేను’ సినిమా సైతం భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నితిన్ తో చేసిన ‘జయం’ సినిమా తో ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే తేజ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తో కూడా సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తేజ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన అన్ని సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే ఒకానొక సమయంలో ఆయనకి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికి నేను స్టార్లను హ్యాండిల్ చేయలేను అని సున్నితంగా తనే తప్పుకున్నాడు.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
మరి ఏది ఏమైనా కూడా తేజా లాంటి దర్శకుడు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటే ఆయన సినిమాకు మంచి బజ్ అయితే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే నితిన్ కి కెరియర్ లో మొదటి సక్సెస్ అందించిన దర్శకుడు అలాగే నితిన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసింది కూడా తేజా నే కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ధైర్యం అనే మరో సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక ఈ సమయంలోనే తేజకి నితిన్ కి మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగిందనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయ్యాయి… ఇక ఈ విషయం మీద తేజ స్పందిస్తూ ధైర్యం సినిమాకి తను అనుకున్నంతగా బడ్జెట్ ని వాళ్ళు ఇవ్వలేదని అందువల్లే ఆ సినిమాని తను అనుకున్న రేంజ్ లో తీయలేదని తద్వారా కొన్ని తగాదాలు వచ్చినట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికైతే తేజకు నితిన్ కి మధ్య గొడవ జరిగిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది… ప్రస్తుతం తేజ తన కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే నితిన్ సైతం ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు…