Kiran Abbavaram New Movie: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఇతని డైలాగ్ డెలివరీ తీరు,నటన,మాట్లాడే యాస ఒక సెక్షన్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించింది. సినిమాలు కూడా కెరీర్ ప్రారంభం లో మంచివే తీసాడు. కానీ ఆ తర్వాత ఒక సూపర్ హిట్ సినిమాని తీస్తే, వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీయడం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం వంటివి చేస్తూ వస్తున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ హీరో చేసిన రెండు చిత్రాలు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అని అంతా అనుకుంటున్నా సమయం లో ఆయనకు ‘క’ అనే సూపర్ హిట్ చిత్రం తగిలింది.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
ఈ సినిమా కథ చాలా కొత్తగా, ఆడియన్స్ అబ్బురపడే రేంజ్ లో ఉండడంతో కిరణ్ అబ్బవరం లో చాలా మార్పు వచ్చింది, ఇక నుండి అన్నీ ఇలాంటి సినిమాలే చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత విడుదలైన ‘దిల్ రూబ’ అనే చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘క’ చిత్రం తో లైన్ లో పడ్డాడు అనుకుంటే మళ్ళీ రొటీన్ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు అంటూ క్రిటిక్స్ మండిపడ్డారు. అయితే ఇది ‘క’ చిత్రం కంటే ముందుగా ఎంచుకున్న సినిమా అని ఆ తర్వాత అర్థమైంది. ఇది కాసేపు పక్కన పెడితే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ మరియు ‘K ర్యాంప్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తో గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అని చాలా కాలం నుండి ఒక టాక్ నడుస్తుంది.
Also Read: సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ తో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తున్నాడా..?
అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఖరారు అయ్యిందట. ప్రముఖ యంగ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఈ సినిమాని స్వయంగా నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతా బాగానే ఉంది కానీ, శ్రీకాంత్ అడ్డాలా ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు, కిరణ్ అబ్బవరం పరిస్థితి కూడా అంతే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించరు. అలాంటి ప్రాజెక్ట్ ని రానా తన సొంత నిర్మాణ సంస్థ లో నిర్మించాలని అనుకున్నాడంటే పెద్ద సాహసం చేస్తున్నట్టే, ఇది అవసరమా అని సోషల్ మీడియా లో అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ రానా నిర్మాణ సంస్థ లో వచ్చే సినిమా అంటే కచ్చితంగా కథలో కొత్తదనం ఉంటుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ ని అయితే రానా సంపాదించుకున్నాడు. ఆ బ్రాండ్ ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి పెంచుతుందో లేదో చూడాలి.