Senior NTR: స్టార్ హీరోలకు ఏజ్ లిమిట్ ఉండదు. జనరేషన్స్ పాటు వాళ్ళ స్టార్డం కొనసాగుతుంది. ఈ క్రమంలో వివిధ తరాల నటులు, హీరోయిన్స్ తో వారు నటిస్తారు. చిరంజీవి విషయానికి వస్తే దాదాపు ఐదు తరాల హీరోయిన్స్ తో ఆయన నటించారు. జయసుధ, విజయశాంతి, త్రిష, శృతి హాసన్ భిన్న తరాలకు చెందిన హీరోయిన్స్. విశ్వంభర మూవీలో సురభి, ఈషా చావ్లా వంటి మరో జనరేషన్ హీరోయిన్స్ తో కూడా ఆయన సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
కాగా సీనియర్ ఎన్టీఆర్ సైతం అనేక మంది హీరోయిన్స్ తో ఆడిపాడారు. సుదీర్ఘ కాలం ఆయన నట ప్రస్థానం కొనసాగింది. ఆయనకు జంటగా నటించిన హీరోయిన్స్ అనంతరం తల్లులుగా నటించారు. ఇందుకు అంజలి ఒక ఉదాహరణ. లవకుశతో పాటు చాలా చిత్రాల్లో ఎన్టీఆర్, అంజలి జంటగా నటించారు. 70ల తర్వాత అంజలి ఎన్టీఆర్ కి కొన్ని చిత్రాల్లో తల్లిగా చేసింది.
ఇక మానవరాలిగా చేసిన శ్రీదేవి అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. బడిపంతులు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ అయిన శ్రీదేవి.. ఎన్టీఆర్ కి మనవరాలు పాత్రలో కనిపించింది. ఆమె పెద్దయ్యాక.. వేటగాడు మూవీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేసింది. అనంతరం వీరిద్దరి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కాగా మరో అరుదైన కాంబో ఎన్టీఆర్ పేరిట ఉంది. అదేమిటంటే… ఎన్టీఆర్ తల్లి, కూతుళ్ల పక్కన హీరోగా నటించారు.
70లలో స్టార్ హీరోయిన్స్ లో జయచిత్ర ఒకరు. ఆమె కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి టాప్ హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్ తో మా దైవం మూవీలో హీరోయిన్ గా చేశారు. కాగా జయచిత్ర తల్లి అమ్మాయి కూడా హీరోయిన్. ఆమెను జయశ్రీ అని కూడా పిలిచేవారు. ఎన్టీఆర్-జయశ్రీ 1959లో విడుదలైన దైవ బలం చిత్రంలో జంటగా నటించారు. కాబట్టి తల్లీ కూతుళ్లు అయిన జయశ్రీ, జయచిత్రలతో హీరోగా నటించిన ఏకైక హీరో ఎన్టీఆర్ అన్నమాట.
ఇక శ్రీదేవి పేరిట కూడా కొన్ని అరుదైన కాంబినేషన్స్ ఉన్నాయి. ఏఎన్నార్ కి జంటగా నటించిన శ్రీదేవి… ఆయన కుమారుడు నాగార్జునతో కూడా రొమాన్స్ చేసింది. ఈ జనరేషన్స్ లో కాజల్, తమన్నా వంటి హీరోయిన్స్ తండ్రి కొడుకులు పక్కన హీరోయిన్స్ గా నటించారు. మగధీర, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో రామ్ చరణ్ కి కాజల్ జంటగా నటించింది. చిరంజీవితో ఖైదీ నెంబర్ 150లో జతకట్టింది.