మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ భావోద్వేగం

దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. అందుకే ఏటా సెప్టెంబర్ […]

Written By: NARESH, Updated On : September 5, 2020 1:07 pm
Follow us on

దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. అందుకే ఏటా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంటాం. ఎంతటి పెద్ద కంపెనీకి సీఈవో అయినా ఆది నుంచి గురువు లేనిదే ఆ స్థాయికి రాలేడు. అందుకే.. సినిమా ఇండస్ర్టీలో ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ అయినా వారికీ గురువులు ఉంటారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన టాలీవుడ్‌ హీరోలు తమ తమ గురువులను తలచుకున్నారు.

Also Read: బిగ్ బాస్: కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది?

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మలయాళ నటుడు ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలీ సోషల్ మీడియాలో స్పందించారు. వారు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

టీచర్స్ డే‌ను పురస్కరించుకొని మహేశ్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. ‘అభ్యాసానికి సరిహద్దులు లేవు. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు ఉత్తమంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో ఎంతో మంది స్ఫూర్తినిచ్చిన, నాకు పలు విషయాలను నేర్పించిన వ్యక్తులు, నన్ను నడిపించిన ప్రతీ ఒక్కరికీ హ్యాపీ టీచర్స్ డే’ అంటూ ట్వీట్ చేశాడు.

టీచర్స్ డే రోజున జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్‌ను గుర్తు చేసుకొంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ భావోద్వగమయ్యారు. ‘నేను ఇంత వాడిని కావడానికి తోడ్పాటునందించిన, ఎన్నో రకాలుగా స్ఫూర్తిగా నిలిచిన నా టీచర్లకు, ముఖ్యంగా గౌరీకి స్పెషల్ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం పిరికిపందలు నిన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్లారు. కానీ భయమే లేని ఓ స్ఫూర్తి మాతోనే ఉంది. నీవు లేని లోటు ఇంకా వెంటాడుతూనే ఉంది.. నన్నుగౌరి. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ అయ్యారు.

సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘మనం ఈ రోజు ఇంత ఎత్తుకు ఎదిగామంటే అందుకు కారణం టీచర్లే. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. సరైనా మార్గంలో నడిపించడానికి, మంచి భవిష్యత్ ఉండాలని వారు పడిన తాపత్రయం మాటల్లో చెప్పలేం. మన జీవితాల్లో గొప్ప పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

‘నా జీవితంపై ఎక్కువగా ప్రభావితం చేసిన వారిలో నా డైరెక్టర్లే ఉన్నారు. మీరే నా లైఫ్‌పై బలమైన ప్రభావం చూపించారు. ఒక్క సినిమా డైరెక్టర్ గురించి చెబితే చాలదు. మీ అందరినీ గురువులుగా భావించి గుర్తు చేసుకోవాల్సిందే’ అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, వెంకీ అట్లూరి, సంకల్ప్ రెడ్డి, అనిల్ రావిపూడి డైరెక్టర్ల ఫొటో పెట్టి ట్వీట్ చేశారు.

మలయాళ నటుడు నవీన్ పౌలీ ఉపాధ్యాయుల సేవలను స్మరించుకున్నారు. ‘నాలోని ప్రతిభను గుర్తించిన ప్రతీ ఉపాధ్యాయుడికి నా శుభాకాంక్షలు. స్కూల్, కాలేజీ స్థాయిలో నాకు సరైన మార్గం చూపించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా కలల్ని సాకారం చేసుకొనే ప్రయాణంలో తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.