కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

2019 అసెంబ్లీ ఎన్నికలు అటు ఆంధ్రలోనూ.. ఇటు తెలంగాణలోనూ వన్‌సైడ్‌ అన్నట్లే జరిగాయి. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అక్కడ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఫాం చేశారు. తెలంగాణలో యాజ్‌ టీజ్‌గా కేసీఆర్‌‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రలో ప్రతిపక్షం అనేది లేకుండా అక్కడ వైసీపీకి ఏకపక్ష మెజార్టీ కట్టబెట్టారు. అక్కడ కాంగ్రెస్‌ ఎప్పుడో కాటికి వెళ్లిపోయింది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం స్థానం ఆక్రమించడానికి అక్కడ […]

Written By: NARESH, Updated On : September 5, 2020 1:29 pm
Follow us on


2019 అసెంబ్లీ ఎన్నికలు అటు ఆంధ్రలోనూ.. ఇటు తెలంగాణలోనూ వన్‌సైడ్‌ అన్నట్లే జరిగాయి. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అక్కడ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఫాం చేశారు. తెలంగాణలో యాజ్‌ టీజ్‌గా కేసీఆర్‌‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రలో ప్రతిపక్షం అనేది లేకుండా అక్కడ వైసీపీకి ఏకపక్ష మెజార్టీ కట్టబెట్టారు. అక్కడ కాంగ్రెస్‌ ఎప్పుడో కాటికి వెళ్లిపోయింది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం స్థానం ఆక్రమించడానికి అక్కడ బీజేపీకి గ్యాప్‌ దొరికింది. ఇక తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉన్న బీజేపీ.. ఇన్నాళ్లు ఏకపక్షంగా ప్రభుత్వం పైనే తన విమర్శలను సంధించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్‌పైనా కాలు దువ్వుతోంది.

Also Read: బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన పని వల్ల మహాకూటమి కట్టి కాంగ్రెస్‌కు సంఖ్యాపరంగా సీట్లు తగ్గాయి కానీ.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ అలానే ఉంది. ఓటు బ్యాంక్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. హస్తం గుర్తుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఉన్నారంటే నమ్మాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్‌ ప్లేస్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ.

ఇది కాస్త కష్టమైన వ్యవహారం అనే విషయమని తెలంగాణ బీజేపీకి బాగా తెలుసు. అయినా తన ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవలే అధిష్ఠానం కూడా యువ లీడర్‌‌.. ఎలాంటి మచ్చ లేని నాయకుడైన కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌‌ను పార్టీ స్టేట్‌ చీఫ్‌గా సెలెక్ట్ చేసింది. ఆయన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరు సలుపుతూనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌‌ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు. నిత్యం ప్రజల్లోకి వెళ్తూ పార్టీకి మైలేజ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వం మీదనే ప్రశ్నలవర్షం కురిపించిన బీజేపీ.. కొత్తగా కాంగ్రెస్‌ మీద పడింది. కేంద్రంలో కాంగ్రెస్‌ ఇస్తున్న ప్రకటనలకు.. రాష్ట్ర కాంగ్రెస్‌తో ముడిపెట్టి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

వాస్తవంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీకి అంతోఇంతో ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం కంటే.. కాంగ్రెస్‌ను బద్నామ్ చేయడం ఈజీ అని భావిస్తోంది. ఒకవేళ ఈ ప్రయోగం  ఫలిస్తే.. హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులు బీజేపీ వైపు రాకున్నా.. మధ్యతరగతి ఓటర్లు, తటస్థ ఓటర్లు, కాంగ్రెస్,- కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా న్యూట్రల్‌గా ఉన్నా మేధో వర్గం తమవైపు వస్తుందని బీజేపీ ఆశ పడుతోంది .

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ,-సామాజిక పరిస్థితుల బట్టి చూస్తే.. బీజేపీ ప్రయత్నాలకు పెద్దగా ఫలితాలు కనిపించే పరిస్థితులు లేవు. కాకపోతే ఇదే వ్యూహాన్ని వాళ్లు కొనసాగిస్తే.. మరో మూడేళ్లలో కాంగ్రెస్‌కు గట్టి ప్రత్యామ్నాయంగా ఏర్పడే ఆస్కారమూ లేకపోలేదు. అయితే కేసీఆర్ హవాను తట్టుకోవాలంటే ఈ మాత్రం వ్యూహాలు సరిపోవని అంటున్నారు రాజకీయ నిపుణులు.