Taskaree Web Series Review: సంక్రాంతి సీజన్ కావడంతో ఈ వారం రోజుల్లో అరడజన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్ ఎలా ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని అందించాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక తెలుగులో 5 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కొన్ని విజయాలు సాధిస్తే మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాయి. ఇక సినిమాలతో పాటు ఓటిటి లో వచ్చే సిరీస్ లు సైతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి… ఇమ్రాన్ హష్మీ మెయిల్ లీడ్ లో వచ్చిన ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఆ సిరీస్ ఎలా ఉంది?సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ కుమార్ (అనురాగ్ సిన్హా) ను తన పై అధికారులు ముంబాయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అసిస్టెంట్ కమిషనర్ గా ప్రకాష్ కుమార్ కి బాధ్యతలను అప్పగిస్తారు… దాంతో ప్రకాష్ కుమార్ ఇక మీదట ముంబాయి లో స్మగ్లింగ్ అనే మాట వినపడకూడదు అనే ఉద్దేశ్యంతో చాలా సిన్సియర్ గా డ్యూటీ నిర్వహిస్తూ ఉంటాడు… దాంతో అప్పటికే సస్పెండ్ అయిన కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో కలిసి ఒక టీమ్ ని ఏర్పాటు చేస్తాడు. ఇక ప్రకాష్ కుమార్ అనుకున్నట్టుగానే అక్రమంగా ఎయిర్ పోర్ట్ ద్వారా స్మగ్లింగ్ చేసేవాళ్ళని పట్టుకున్నారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు ఈ సిరీస్ ని చాలా ఎంగేజింగ్ గా నడిపించే ప్రయత్నం చేశాడు. మొదటి మూడు ఎపిసోడ్లు ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా ఫాస్ట్ గా ముందుకు సాగుతూ ఉంటాయి. కానీ నాలుగో ఎపిసోడ్ నుంచి సినిమా మూమెంట్ మొత్తం తగ్గిపోతుంది. చాలావరకు ప్రేక్షకులకు బోర్ కొట్టించే అంశాలే ఉంటాయి. అవన్నీ రిపీటెడ్ గా రావడం వల్ల ప్రేక్షకులు సైతం ఈ సిరీస్ ని చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు…
ఇక ఇప్పటికే చాలా సినిమాల్లో బంగారాన్ని గాని ఇంకేదైనా డ్రగ్స్ లాంటి వాటిని ఎయిర్ పోర్ట్ నుంచి ఎలా తప్పిస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మూవీస్ లో చూపించారు. వాటిని మించి ఈ సిరీస్ లో చూపించాల్సింది. కానీ అలా చేయలేదు. నిజానికి డిఫరెంట్ కథలను అంతే వైవిధ్యంగా చూపిస్తే బాగుంటుంది. కానీ రొటీన్ రెగ్యూలర్ గా సినిమాను నడిపించడంతో ఇక సిరీస్ మొత్తంలో ఒకటి రెండు మినహాయిస్తే ఇందులో హై ఇచ్చే సన్నివేశాలు పెద్దగా ప్రేక్షకుడికైతే కనిపించలేదు.
దాని వల్ల గ్రాఫ్ మొత్తం ఒకటే టెంపోలో వెళ్తున్నట్టుగా అనిపించింది తప్ప అక్కడక్కడ హై అయినట్టుగా ఎక్కడా కనిపించలేదు… మ్యూజిక్ కొంతవరకు పర్లేదు. ఉన్నంతలో బాగానే సెట్ అయింది… ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐదవ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలన్ని ఎమోషనల్ గా ఉండటం వల్ల సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. దాని వల్లే ఆ ఎపిసోడ్స్ అన్ని హైలైట్ గా నిలిచాయి. ఐదోవ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలన్ని ఎమోషనల్ గా ఉండటం వల్ల దానికి చాలా వరకు హెల్ప్ అయింది. దాని వల్లే ఆ ఎపిసోడ్స్ అన్ని హైలైట్ గా నిలిచాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇమ్రాన్ హష్మీ చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రనైతే పోషించాడు… గత సంవత్సరం ఓజి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లడనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వల్లే ఈ సినిమా నిలబడింది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మిగిలిన పాత్రల్లో నటించిన వారందరు సినిమా కోసం ప్రాణం పెట్టేసారు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ కి ప్రతి ఒక్కరు హెల్ప్ అయ్యారు. వాళ్ళందరూ సిరీస్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది…
టెక్నికల్ అంశాలు
ఇక మ్యూజిక్ విషయంలో పర్లేదు అనిపించినప్పటికి విజువల్ గా సినిమా ఇంకాస్త గ్రాండీయర్ గా ఉంటే బాగుండేదని కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు… ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బెటర్ గా ఉంటే ఇంకా మంచి ఔట్ పుట్ వచ్చి ఉండేది…
బాగున్నవి
ఇమ్రాన్ హష్మీ
కథ
డైరెక్షన్
బాగోలేనివి
కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టించాయి…
స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.25/5
చివరి లైన్ :
ఖాళీ గా ఉంటే వీకెండ్స్ లో ఒకసారి చూడవచ్చు…