Homeఎంటర్టైన్మెంట్Tarun: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన తరుణ్..అప్పట్లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేసింది...

Tarun: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన తరుణ్..అప్పట్లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేసింది అందుకేనా?

Tarun: 2000 దశాబ్దం ప్రారంభం లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో తరుణ్..బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఆ తర్వాత నువ్వే కావలి సినిమాతో హీరో గా పరిచయమై తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు..ఆ తర్వాత వరుసగా ప్రియమైన నీకు, ఎలా చెప్పను, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే ఇలా వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి అతి తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు.

Tarun
Tarun

అయితే ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోక స్టార్ ఇమేజిని కోల్పోయి సినిమాలు ఆపేసాడు..ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిజినెస్ లు నడుపుతూ సినీ జీవితానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు..ఇది ఇలా ఉండగా తరుణ్ పై అప్పట్లో చాలా రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉండేవి..తరుణ్ – ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారని..వాళ్ళిద్దరి పెళ్లిని తరుణ్ తల్లి రోజా రమణి ఒప్పుకోకపోవం వల్లే ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యయత్నం చేసిందని..ఇలా పలు రకాల వార్తలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి.

అయితే తరుణ్ అప్పట్లో కేవలం ఆర్తి అగర్వాల్ తో మాత్రమే కాదు..శ్రియా తో కూడా ప్రేమాయణం నడిపాడట..ఇద్దరితో ఒకరికి తెలీకుండా ఒకరితో ఆయన ప్రేమాయణం నడిపినట్టు కూడా వార్తలు వచ్చాయి..అది తెలిసే ఆర్తి అగర్వాల్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది అని కూడా అంటూ ఉంటారు..ఇక అసలు విషయానికి వస్తే తరుణ్ శ్రియ తో అప్పట్లో మూడు సినిమాలు చేసాడు..నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు మరియు ఎలా చెప్పను వంటి సినిమాల్లో వీళ్లిద్దరు నటించారు..’నీ మనసు నాకు తెలుసు’ సమయం లో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందని.

Tarun
Tarun

అప్పట్లో వీళ్లిద్దరు కలిసి పార్టీలు , పబ్బులకు తెగ తిరిగేవారని ఇండస్ట్రీ లో అందరూ మాట్లాడుకునే వారు..అప్పట్లో తరుణ్ తన ప్రతి సినిమాలో కూడా శ్రియా ని హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబట్టేవాడట..అలా వీళ్లిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు..ఇది ఇలా ఉండగా ఇటీవలే వీళ్లిద్దరు కలిసి నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా AMB సినిమాస్ లో మూవీ యూనిట్ మొత్తానికి ఒక ప్రత్యేక షో వేసుకున్నారు..ఈ షో కి శ్రియ , తరుణ్ మరియు త్రివిక్రమ్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం హాజరైంది..సినిమా అయిపోయిన తర్వాత మీడియా తో శ్రియ మాట్లాడుతున్న సమయం లో తరుణ్ మైక్ అందుకొని ‘నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు’ అని అడుగుతాడు..అప్పుడు శ్రియ నవ్వుతు తరుణ్ కి ముద్దు పెడుతుంది..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఎలా ట్రెండ్ అవుతుందో మన అందరికి తెలిసిందే..ఆరోజు వీళ్లిద్దరి మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ ని చూస్తే కచ్చితంగా అప్పట్లో వచ్చిన రూమర్స్ నిజమేనేమో అనే అనుమానం రాక తప్పదు.


https://youtu.be/2z4-K6DA9Jk

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular