Diwali Movies 2022 Telugu: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా గట్టెక్కి బయటపడడం చాలా కష్టమే. సినిమా కంటెంట్, నటుల యాక్షన్ బాగా ఉంటేనే ఆ మూవీని ఆదరిస్తున్నారు. ఈ విషయంలో కాస్త అటూ ఇటూ అయితే ఆడియన్స్ థియేటర్ వైపే వెళ్లడం లేదు. కొన్ని భారీ చిత్రాలు ప్రమోషన్, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తూ బలవంతంగా ఆడియన్స్ ను రప్పిస్తున్నారు. కానీ ఓవరాల్ గా మాత్రం బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించలేదనె చెప్పాలి. ఇప్పుడున్న వాటిలో గాడ్ ఫాదర్, కాంతార లను తప్పిస్తే మిగతా సినిమాలు పేరుకు రానివే. ఈ సమయంలో దీపావళి సందర్భగా మరో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నారు. మరి బాక్సాపీస్ వద్ద వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది..?

ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్న ఆనవాయితీ. ఈ శుక్రవారం కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ వారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి విడుదలయన సినిమాలకు దీపావళి ఆఫర్ కూడా కలిస్తోంది. వీకెండ్ లోనే ఫెస్టివల్ కూడా ఉండడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో సినిమా కలెక్షన్లు బాగా ఉంటాయని ఆయా సినిమాల నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నట్లు ఉంటుందా..? అనేది తెలియదు.
‘ఓరి దేవుడా’, ‘జిన్నా’, అనే తెలుగు సినిమాలతో పాటు తమిళ వెర్షన్ ‘సర్దార్’, ‘ప్రిన్స్ ’లు ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’కు ఇప్పటికే క్రేజ్ పెరిగింది. చాలా రోజుల తరువాత విష్ణు మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు. అటు ‘ఓరి దేవుడా’తో విశ్వక్ సేన్ మరోసారి తన ప్రతిభ చూపున్నాడు. ఇక తమిళ వెర్షన్ ‘సర్దార్’, ‘ప్రిన్స్ ’లు ఆకట్టుకున్నాయి. దీంతో కొందరు వాటికి ఆకర్షితులైన వారు థియేటర్లోకి వెళ్లే చాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో ఏ సినిమా సక్సెస్ అవుతుందోనన్న చర్చ ఇండస్ట్రీ లెవల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఏ సినిమా అయినా మొదటి, రెండో రోజు టాక్ తెలిసిపోతుంది. అయితే శుక్రవారం రిలీజ్ కాగానే సోమవారం వరకు ప్రేక్షకుల్లో మైనస్ పడకుండా చూసేకునే సినిమా ఏదో చూడాలి. ఆడియన్స్ ఒక్కసారి ఆ సినిమా బాగా లేదంటే అటువైపు వెళ్లడం మానేస్తారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది బాక్సాసీప్ వద్ద హిట్టు కొడుతుందో చూడాలి.