Tanzania Shoot Schedule: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మీడియం రేంజ్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకున్న ఇమేజ్ చాలా తక్కువనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు చూడడానికి జనాలు థియేటర్లకు వస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం వేల రూపాయలను ఖర్చు పెట్టుకొనైన సరే సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళుతున్నప్పటికి మహేష్ బాబు మాత్రం రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ ప్రేక్షకులందని మెప్పించడమే కాకుండా తన మార్కెట్ ను కూడా భారీగా పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: మహేష్, రాజమౌళి సినిమా గురించి సెన్సేషనల్ అప్డేట్!
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాతో మరోసారి ప్రపంచ ప్రేక్షకులందరిని మంత్రముగ్ధులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలావరకు గొప్ప ఎలిమెంట్స్ అయితే ఉండబోతున్నాయట. రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్గా మూడో షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈస్ట్ ఆఫ్రికా దేశం అయిన టాంజానియా లో మూడో షెడ్యూల్ ని చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు.
ఇక మూడో షెడ్యూల్లో మహేష్ బాబు మీద ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు – ప్రియాంక చోప్రా మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది.
Also Read: మహేష్ బాబు – మోహన్ లాల్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?
మహేష్ పూర్తి స్థాయిలో తన నటన ప్రతిభను బయటకు తీసి ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి రాజమౌళి సైతం మహేష్ బాబుకి భారీ సక్సెస్ ని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ సినిమాను 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది…