Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. ఏది అడిగినా అదే చెబుతుందట !

ప్చ్.. ఏది అడిగినా అదే చెబుతుందట !

Tanya Ravichandran: హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ప్రస్తుతం టాలీవుడ్ పై పడింది. అవకాశాల కోసం ప్రత్యేక పీఆర్వో టీమ్ ను పెట్టుకుని పనిలో పనిగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. పైగా ఆమె నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా రిలీజ్ కి కూడా సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. అసలుకే కార్తికేయ వరుస ప్లాప్స్ లో ఉన్నాడు. అందుకే ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు.

Tanya Ravichandran
Tanya Ravichandran Pics

అంచనాలను పెంచడానికి చిత్రబృందం ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. ఎలాగూ తాన్యా రవిచంద్రన్ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి బాగా ఉత్సాహం చూపిస్తోంది కాబట్టి.. ఆమెతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే, తాన్యా మాత్రం సినిమా గురించి కంటే.. కూడా తన గురించే ఎక్కువ ప్రమోట్ చేసుకుంటుంది.

Tanya Ravichandran
Tanya Ravichandran Pics

మీడియా మిత్రులు ఏ ప్రశ్న అడిగినా ఆమె తన పర్సనల్ విషయాలే ఎక్కువ చెబుతుంది. ‘రాజా విక్రమార్క’ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ? అని అడిగితే.. తాన్యా రవిచంద్రన్ సమాధానం ఈ విధంగా సాగింది. ‘అసలు నేను సినిమాల్లోకి ఎలా వచ్చాను అంటే.. నేను అప్పుడు పీజీ చేస్తున్న సమయంలో ఓ సినిమా కో డైరెక్టర్ నన్ను చూసి నా ఫోటోలను తీసి కొంతమంది డైరెక్టర్లకు పంపాడు.

Tanya Ravichandran
Tanya Ravichandran Pics

ఆ ఫోటోలు కారణంగా తమిళ పరిశ్రమ నుంచి నాకు అవకాశాలు వచ్చాయి. అలా తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేయడం జరిగింది. అలా సినిమాల్లోకి వచ్చాను’ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ‘సరే.. హీరో కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పండి ?’ అని అడిగితే.. ‘నేను ఈ సినిమాలో చాలా సహజ పాత్రలో కనిపిస్తాను.

Tanya Ravichandran
Tanya Ravichandran Pics

నా నటన అందరికీ నచ్చుతుంది. కార్తికేయ కూడా సెట్ లో ఎప్పుడూ నా నటనను మెచ్చుకుంటూ ఉండేవాడు. కార్తికేయతో నాకు వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎలా ఉన్నా.. నాతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ను మాత్రం కార్తికేయ బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు’ అంటూ ఇలా తనదైన శైలిలో తాన్యా చెబుతూ పోయింది తప్ప, సరైన సమాధానాలు మాత్రం చెప్పలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version