Bigg Boss 9 Telugu Promo: దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది,ఆ లిమిట్ దాటిన రోజు అవతల మనుషులకు చిరాకు కలుగుతాది. ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) షో లోని తనూజ ని చూస్తే ఆడియన్స్ కి ఇప్పుడు చిరాకు కలుగుతుంది. ప్రతీ చిన్న విషయానికి హౌస్ మొత్తం దద్దరిల్లిపోయేలా అరవడం, ప్రతీ దానికి నస పెట్టడం వంటివి చేస్తోంది. ముఖ్యంగా ఆమెకు కిచెన్ డిపార్ట్మెంట్ పని పడినప్పుడు మాత్రం హౌస్ మేట్స్ కి ఆమె పట్టపగలే చుక్కలు చూపించేస్తోంది. ఈ వారం లో సంజన తో ఆమె పడిన గొడవ ని అంతా చూసారు. ఈ విషయం లో పొరపాటు సంజనదే. కానీ అన్నం తింటున్న సమయం లో దాని గురించి చర్చించి ఎవరైనా గొడవలు పెద్దది చేస్తారా?, తనూజ అదే చేసింది. అన్ని చిన్నపిల్ల లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది, అలా అని చిన్న పిల్ల మాత్రం కాదు, ఆమె వయస్సు 30 కి పైగానే ఉంటుంది.
ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే విడుదలైన రెండవ ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో తనూజ పవన్ కళ్యాణ్ పై ఏ రేంజ్ లో నోరు పారేసుకుందో కూడా చూసాము. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమి అనలేదు, రాత్రికి ఏ కూర వండాలి అనే దానిపై చర్చించుకుంటున్నారు అంతే. తన అభిప్రాయం కెప్టెన్ ఇమ్మానుయేల్ కి చెప్తున్న సమయం లో తనూజ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అతి చెయ్యకు అని, నువ్వు ఎవరు చెప్పడానికి అని, హౌస్ మేట్స్ ఎవ్వరికి లేని బాధ నీకు ఎందుకు అని, ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ కూడా మాటలు పడలేదు. తనూజ కి సరైన కౌంటర్స్ తో ఇచ్చి పారేసాడు. నువ్వు ఎవరు అని అంటావేంటి?, హౌస్ మేట్ గా నా అభిప్రాయం కెప్టెన్ కి చెప్తున్నాను, నీ ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదు అని కౌంటర్ అటాక్ ఇచ్చాడు.
కళ్యాణ్ తన కోసం తాను స్టాండ్ తీసుకొని మాట్లాడినందుకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. అదే సమయం లో తనూజ ఓవర్ యాక్షన్ పైన కూడా ట్రోల్స్ వేస్తున్నారు. తనూజ కి బయట నుండి ఆమెనే నెంబర్ 1 లో ఉంది అనే ఇన్ పుట్స్ వచ్చేసరికి తలపొగరు ఆకాశానికి అంటిందని, అందుకే ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. తనూజ ఇన్ని రోజులు హౌస్ చేసిందేమి లేదు, అరవడం, అలగడం, ఏడవడం తప్ప ఒక్క టాస్క్ కూడా ఆడలేదు అంటూ ఆమెపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. తనూజ ప్రస్తుతానికి టాప్ లోనే ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ లో గ్రాఫ్స్ ఒకే ఒక్క మూమెంట్ లో ఆరిపోతూ ఉంటుంది. తనూజ పద్దతి మార్చుకోకుంటే టాప్ 5 లో కూడా ఉండదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
