Nagarjuna , Naga Chaitanya
Nagarjuna and Naga Chaitanya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా మంచి పాత్రలను పోషిస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అందువల్లే ఒక హీరోని మించి మరొక హీరో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ వాళ్లకు ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకుంటూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్ళకంటు ఒక స్టార్ డమ్ ని కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా నాగేశ్వరరావు(Nageshwara Rao), నాగార్జున (Nagarjuna) లాంటి నటులు స్టార్ హీరోలుగా అవతరించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో వాళ్ళు చాలా వరకు కృషి చేశారు. ఇక మొదట్లో తమిళ్ ఇండస్ట్రీ తో కలిసి ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చెన్నై నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చిన ఘనత నాగేశ్వరరావు గారికే దక్కుతుంది… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగచైతన్య (Naga chaithanya)… తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు… ఇక రీసెంట్ గా ‘తండేల్ ‘ (Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఓకేత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అయితే తండేల్ సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వచ్చినప్పటికి కొన్నిచోట్ల డివైడ్ టాక్ తో నడుస్తుంది…
ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య వాళ్ళ ఫాదర్ అయిన నాగార్జున చేసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు రెండు మాత్రమే ఉన్నాయట. అవి ఏంటి అంటే అందులో ఒకటి ‘హలో బ్రదర్’ కాగా, మరొకటి ‘మన్మధుడు ‘…
ఈ రెండు సినిమాల్లో నాగార్జున డిఫరెంట్ వేరియేషన్స్ లో నటిస్తూ ఉంటాడు. కాబట్టి తనకు ఆ మాడ్యులేషన్ అనేది చాలా ఇష్టమట…ఇక అలాంటి పాత్రలను చేయడానికి నాగచైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయనకి ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్లు ఉన్న స్క్రిప్ట్ తగలడం లేదట… ఒకవేళ ఫ్యూచర్ లో కనక వాటిని రీమేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆ రెండు సినిమాలను తనే రీమేక్ చేస్తానని చెప్తుండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తండేల్ సినిమాలో ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఫస్ట్ టైమ్ తను రెస్టిక్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మొత్తానికైతే ఈ సినిమాలో నాగచైతన్య చాలా కీలకపాత్ర వహించాడు…