Tandel ticket rates : అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya)హీరోగా, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా వస్తున్న తండేల్ (Thandel) సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఇలాంటి నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుమతిని ఇస్తుందా? లేదా అనే విషయం మీద ఇప్పుడు హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ఇక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో చర్చలను జరుపుతున్న నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిని కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. అయితే ఇంతకుముందు పుష్ప2, దేవర, గేమ్ చేంజర్ లాంటి సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో హైక్ అయితే ఇచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో తండేల్ సినిమా ఆ మూవీస్ మాదిరిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కపోయినప్పటికి నాగచైతన్య పరిధిని మించి బడ్జెట్ అయితే పెట్టారు. కాబట్టి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ధోరణిలో ప్రొడ్యూసర్స్ ఏపీ గవర్నమెంట్ ను విన్నవించుకుంటున్నారు. మరి గవర్నమెంట్ వీళ్ళ వాదనలు విన్న తర్వాత మల్టీ ప్లెక్స్ ల్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయల పాటు హైక్ అయితే విధించే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా సూపర్ హిట్ టాక్ వస్తే జనాలు పెంచిన టికెట్ రేట్లకు అనుగుణంగా సినిమాలు చూడడానికి ముందుకు వస్తారు. లేదంటే మాత్రం సినిమాని చూడడానికి ఏ ప్రేక్షకులు కూడా ముందుకు వచ్చే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో అయితే ప్రస్తుతం 295 రేటుగా ఫిక్స్ చేశారు.
కాబట్టి ఇక్కడ మరింత పెంచే అవకాశాలు అయితే లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఆంధ్రాలోనే చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక టిక్కెట్ రేట్ పెంచిన కూడా ఒక వారం రోజుల పాటే టిక్కెట్ రేట్ ను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మరి ఆ తర్వాత కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టాలి అంటే మాత్రం సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ అయితే రావాల్సి ఉంటుంది.
నాగచైతన్య ఈ సినిమాతో ఎంతవరకు వసూళ్లను కలెక్ట్ చేస్తాడు. తద్వారా ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది తెలిసే అసలైన సమయం అయితే వచ్చిందనే చెప్పాలి… మరి ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సినిమా టిక్కెట్ రేట్ ని ఎంతకు ఫిక్స్ చేస్తుంది అనేదాని మీదనే ఇప్పుడు ఈ సినిమా వసూళ్లు డిపెండ్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది…