Tandel
Tandel : అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) నటించిన ‘తండేల్'(Thandel Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబతిన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత హిట్ పడడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో మూవీ టీం గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ ని జరుపుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా విచ్చేసారు. అయితే ఈ ఈవెంట్ లో ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన బన్నీ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ ఆరవ రోజు ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ లిస్ట్ లోకి చేరుతుంది అని అంటాడు. కానీ నిజానికి ఈ సినిమా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ఫుల్ రన్ లో కూడా కొట్టడం కష్టమేనని అంటున్నారు ట్రేడ్ పండితులు.
నిర్మాతలు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు కానీ, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఆ రేంజ్ వసూళ్లు కష్టమేనని టాక్. నాల్గవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఐదవ రోజు 2 కోట్ల 50 లక్షల రూపాయలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఓవర్సీస్ లో అయితే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో గతం లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ‘తండేల్’ చిత్రం ఫుల్ రన్ లో కూడా ఆ రేంజ్ రాబట్టడం కష్టమే అంటున్నారు. మంగళవారం రోజున ఆఫర్స్ పెట్టుకొని కూడా ఈ చిత్రానికి కేవలం 50 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. వచ్చిన పాజిటివ్ టాక్ కి ఈ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పొచ్చు.
ఓవరాల్ గా 5 రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. వంద కోట్ల గ్రాస్ వసూళ్లకు ఇంకా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కావాలి. వాలెంటైన్స్ డే వీకెండ్ బలమైన కలెక్షన్స్ ని రాబడితే వంద కోట్ల గ్రాస్ మార్కుకి దగ్గరగా వెళ్లొచ్చు. ఎందుకంటే ఆ వీకెండ్ బలమైన వసూళ్లు వస్తే శివ రాత్రి వరకు మంచి హోల్డ్ ఉంటుంది. శివరాత్రి రోజున కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు రావొచ్చు. వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవాలంటే అప్పటి వరకు ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూనే ఉండాలి. మరి ఆ రేంజ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది.