Akkineni Naga Chaitanya
Akkineni Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) హీరో గా నటించిన ‘తండేల్'(Thandel Movie) చిత్రం భారీ విజయం సాధించిన సందర్భంగా మూవీ టీం మొత్తం నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో నాగార్జున ‘తండేల్’ విజయం పై మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చాలా కాలం తర్వాత సక్సెస్ మీట్ కి రావడం ఎంతో ఆనందంగా ఉంది, మాకంటే ఎక్కువగా అభిమానులు ఈ సక్సెస్ ని గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అక్కినేని నాగచైతన్య లో నేను మా నాన్నగారిని ఈ సినిమాలో చూసాను వంటి సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు. ఈ ఈవెంట్ కి నాగార్జున(Akkineni Nagarjuna), నాగ చైతన్య తో పాటు శోభిత కూడా పాల్గొన్నది. అయితే ఈ సంర్భంగా డైరెక్టర్ చందు మొండేటి ఒక నాగచైతన్య తో చేయబోయే తదుపరి చిత్రం గురించి ఒక కీలక అప్డేట్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘నాగార్జున గారు..మీరు ఈ సినిమా సక్సెస్ గురించి ఎంత ఆనందిస్తున్నారో మాకు తెలుసు. మేము మీకంటే ఎక్కువ సంతోషిస్తున్నాము. నేను నాగ చైతన్య గారీతి సవ్యసాచి లాంటి ఫ్లాప్ తీసినప్పటికీ, బన్నీ వాసు నన్ను ఆరోజుల్లోనే గట్టిగా నమ్మాడు, భవిష్యత్తులో మనం నాగ చైతన్య గారితో సినిమా తీసి పెద్ద హిట్ కొడుతాం అని అన్నాడు, ఇప్పుడు తండేల్ రూపం లో అదే జరిగింది. ఈ సినిమా కథని నా తర్వాత ఎక్కువ అర్థం చేసుకుంది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారే. ఆయన అర్థం చేసుకున్న విధానం కారణంగానే ఈ రోజు సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ రూపం లో జనాలకు డెలివర్ అయ్యింది. ఎడిటర్ నవీన్ నూలి కూడా ఈ సినిమాకి వెన్నుముకలాగా నిలిచాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా చందూ మొండేటి శోభిత వైపు చూస్తూ మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘శోభిత గారు, మీకు తెలుగు భాషపై ఉన్నంత పట్టు, ఎవరికీ ఉండదని నేను విన్నాను. దయచేసి మీ బాషా ప్రావిణ్యం మా హీరో నాగచైతన్య గారికి కూడా అందించండి. ఎందుకంటే మేము త్వరలోనే ఏఎన్నార్ గారి తెనాలి రామకృష్ణ సినిమాని రీమేక్ చేయబోతున్నాము. ఇక నుండి మేము కొట్టేది కేవలం సిక్సర్లు మాత్రమే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ‘తెనాలి రామకృష్ణ’ సినిమా సంచలన విజయం సాధించింది. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు తెనాలి రామకృష్ణ పాత్ర పోషిస్తే, ఎన్టీఆర్ శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించారు. ఈ కథ పై సీరియల్స్ బాలీవుడ్ లో తెరకెక్కాయి కానీ, సినిమాలు మాత్రం మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ కథపై సినిమా తెరకెక్కనుంది, చూడాలి మరి తెనాలి రామకృష్ణ గా నాగచైతన్య ఎంతమేరకు మెప్పిస్తాడు అనేది.